దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : అధికార భారస మహబూబాబాద్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, అసమ్మతి నేతలు శనివారం రోజు మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలోని ఓ మామిడితోటలో రహస్య భేటీ అయ్యారు.
Also Read : కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం ఆరా..!? ఉద్యమ నేతకు అవకాశం దక్కేనా?? @DhivitiNews.com
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహబూబాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మరోసారి పార్టీ టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు.
శంకర్ నాయక్ స్థానంలో కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా శంకర్ నాయక్ కె టికెట్ ఇస్తే ఆయన గెలుపుకు సహకరించేది లేదని అన్నారు. ఈ రహస్య భేటీలో మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News