దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తే సహకరించేది లేదని మహబూబాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాలలో భారస అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహించి బాహాటంగానే ప్రకటిస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించి కార్యకర్తలను బుజ్జగించే పని చేసినప్పటికీ, భారాస నేతల్లో అసమ్మతి జ్వాలలు ఇంకా సమసిపోయినట్టు కనిపించడం లేదు.
Also Read : రెడ్ల ‘కోట’లో ‘శంకరు’ని పాగా..!! @DhivitiNews.com
ఆదివారం నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం, మదనాతుర్థి గ్రామంలో పలువురు అసమ్మతి నేతలు మామిడి తోటలో సమావేశమయి, శంకర్ నాయక్ కు పార్టీ టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని, తమ పార్టీ బిఆర్ఎస్ అయినప్పటికీ ఆయనను ఓడించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అయితే, అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుకూల కార్యకర్తలు కొందరు అసమ్మతి నేతల సమావేశాన్ని వ్యతిరేకించారు. ఇలాంటి చర్యలకు పాల్పడి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయొద్దని, రెచ్చగొట్టే ధోరణి వీడాలని శంకర్ నాయక్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
Admin
Dhiviti News