దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణం కేసముద్రం రోడ్డులోని బాలసదనంలో మంగళవారం రాహుల్ నాయడు అనే సామాజిక కార్యకర్త సుమారు 22 మంది బాలికలకు బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులు పిల్లలకు పంపిణీ చేశారు.
Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com
ఈ సందర్భంగా సిడబ్ల్యుసి చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి మాట్లాడుతూ సేవా గుణంతో రాహుల్ పిల్లలకు విద్యకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, వాటర్ బాటిల్స్, జామెట్రి బాక్స్ లు అందజేయడం అభినందనీయమని రాహుల్ నాయుడును అభినందించారు. సేవ గుణంతో అందించిన విద్యకు అవసరమైన వస్తువులను వినియోగించుకొని బాలికలు అందరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి సభ్యులు డా. డేవిడ్, బిఆర్బి కోఆర్డినేటర్ లక్ష్మి, పీవోఐసి వీరన్న, ఉమేష్, డింపుల్, లోకేష్, బాలసాధనం సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Dhiviti News