Thursday, 07 December 2023 11:04:42 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

న్యాయం కోసం మహిళా బిక్షాటన..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Mahabubabad, #Garla, #LocalNews

Date : 22 July 2023 06:10 PM Views : 263

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : న్యాయం కోసం ఓ మహిళ తన భర్తతో కలిసి బిక్షాటన చేసిన ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com

వివరాలలోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంకు చెందిన బాడిష లక్ష్మీ తన ఇంటి స్థలాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మంగీలాల్ అనే వ్యక్తితోపాటు కొందరు వ్యక్తులు కలిసి ఆక్రమించడంతో ఎదిరిస్తే తనపై దాడికి దిగుతూ, దౌర్జన్యం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ సెంటర్ వద్ద వ్యాపార దుకాణాలలో బిక్షాటన చేసింది. అనంతరం కోర్ట్ సెంటర్ లో గల అంబెడ్కర్ విగ్రహం ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన గోడును వెళ్లబోసుకుంది.

బాధితురాలు వివరాలు తెలుపుతూ తాను 2004లో కురేవెళ్ళ రాజగోపాల్ కు చెందిన పురాతన గృహము (ఇంటి నంబర్ 5-34)తో పాటు ఖాళీ స్థలం 474 గజాలు విక్రయం చేసి తన కుల వృత్తి అయిన కుమ్మరి వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నానని, గత సంవత్సరం మే నెల నుండీ అజ్మీరా మంగిలాల్ తన భార్య రత్న కుమారీ తోపాటు గుగులోతు కిషన్, భారతి, భూక్యా ఆనంద్, శ్రీను, సీతా, కంటేం వెంకన్న, సరోజా, క్రాంతి, సేట్యా, బుజ్జీ వారి అనుచరులు పతకం ప్రాకారం తప్పుడు భూధస్తావేజులు, పత్రాలు, అగ్రిమెంట్లు సృష్టించి తన ఖాళీ స్థలాన్ని ఆక్రమించి నూతన గృహాన్ని నిమిస్తుండగా, తాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో తనను దుర్భాషలాడుతూ హింసించి బట్టలు చింపి వీధుల్లో పరుగెత్తించి కొట్టారని తెలిపారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో 6 మార్లు పిర్యాదు చేసినా, డయల్ 100 నంబర్ కు పలుమార్లు కాల్ చేసినాకానీ స్థానిక గార్ల పోలీస్ వారు నామమాత్రపు కేసులు నమోదు చేసి మమ అనిపించి తనకు అన్యాయం చేశారని పాత్రికేయుల సమక్షంలో అవేదల వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన మంగీలాల్ తనను బాధిస్తూ తన భూమిని ఆక్రమించడంతో న్యాయం కోసం తాను సదరు వ్యక్తులపై డిజిపికి, జిల్లా ఎస్పీకి, గార్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారని, కానీ న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, జిల్లా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిరావడంతో కడు బీదరాలినైన తనకు కేసుల కోసం తిరగడానికి ఛార్జీలకు, కర్చులకు డబ్బులు సైతం లేవని, దీనితో న్యాయం కోసం తిరగడానికి బిక్షాటన చేస్తున్నానని బాడిష లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :