Thursday, 07 December 2023 09:31:37 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

Q న్యూస్ లీక్.. ముందే చెప్పిన దివిటీ.. జిల్లా బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #MalothKavitha #ShankarNaik, #SatyavathiRatohd, #RedyaNaik, #Mahabubabad, #BRS

Date : 23 July 2023 08:42 PM Views : 510

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : త్వరలో తెలంగాణా (Telangana)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ల స్థానంలో మార్పులు ఉంటాయని ఇప్పటికే పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అయినప్పటికీ, ప్రభుత్వం (Government) నుండి ఈమేరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల అసెంబ్లీ టికెట్ల పై సైతం గత నెల రోజులుగా ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అధికార పార్టీ ప్రకటించే అభ్యర్థుల జాబితాను బట్టి కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) తమ అభ్యర్థులను ప్రకటించే విధంగా వ్యూహాత్మక ఎత్తుగలలో భాగంగా వేచి చూస్తోంది.

Also Read : "ముందు మురిసినోడు పండుగ కానడు" అన్నట్టుగా కాంగ్రెస్ తీరు @DhivitiNews.com

అయితే, తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) నేతృత్వంలో నిర్వహించబడుతున్న సంచలన యూట్యూబ్ ఛానల్ Q News రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఖాయమైన భారాస, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చేజిక్కించుకొని, "విశ్వసనీయ సమాచారం మేరకు" అనే టాగ్ లైన్ తో ఆయా పార్టీల ఖాయమైన అభ్యర్థుల జాబితాలు తమ ట్విట్టర్ (Twitter) వేదికగా ఆదివారం లీక్ చేసి సంచలనం సృష్టించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారాస (BRS), కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ గురించి కాస్త పక్కన పెడితే, మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో సిట్టింగ్ ల స్థానాలపై ఇదివరకే దివిటీ న్యూస్ వెబ్సైటు (www.DhivitiNews.com) "నాయకుల స్థానాలకు నాయకురాళ్లు ఎసరు..!!" అనే శీర్షికన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయిన శంకర్ నాయక్ (Shankar Naik) (మహబూబాబాద్) స్థానంలో మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) కు, అలాగే రెడ్యా నాయక్ (Redya Naik) (డోర్నకల్) స్థానంలో ఆయన కుమార్తె ఎంపీ మాలోత్ కవితల (Maloth Kavitha)కు అధిష్టానం టికెట్ ఖాయం చేసే అవకాశాలున్నట్టు సంచలన కథనాన్ని అందించగా ఈ కథనం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన మహబూబాబాద్ జిల్లా లోని అధికార పార్టీ అభ్యర్థుల లిస్ట్ సైతం దివిటీ న్యూస్ వెబ్సైటు ప్రచురించిన ప్రత్యక కథనంను ఏకీభవిస్తూ శంకర్ నాయక్ (మహబూబాబాద్) స్థానంలో మంత్రి సత్యవతి రాథోడ్ కు, అలాగే రెడ్యా నాయక్ (డోర్నకల్) స్థానంలో ఆయన కుమార్తె ఎంపీ మాలోత్ కవితలకు అధిష్టానం టిక్కెట్లు ఖాయం చేసినట్టు తెలిపింది.

ఏది ఏమైనప్పటికీ, Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన అభ్యర్థుల జాభితా విశ్వసనీయత ఎంతమేరకు ఉంటుందో తెలియదుగానీ, మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు ఈ సమాచారం ఊతమిచ్చిందనే చెప్పవచ్చు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :