Thursday, 07 December 2023 10:20:42 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

హుస్సేన్ నాయక్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్..!? లీక్ చేసిన ప్రముఖ ఛానెల్..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #HussainNaik, #BalaramNaik, #RamachandruNaik, #Mahabubabad, #Congress

Date : 23 July 2023 08:47 PM Views : 741

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : త్వరలో తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ల స్థానంలో మార్పులు ఉంటాయని ఇప్పటికే పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అయినప్పటికీ, ప్రభుత్వం నుండి ఈమేరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల అసెంబ్లీ టికెట్ల పై సైతం గత నెల రోజులుగా ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అధికార పార్టీ ప్రకటించే అభ్యర్థుల జాబితాను బట్టి కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించే విధంగా వ్యూహాత్మక ఎత్తుగలలో భాగంగా వేచి చూస్తోంది.

Also Read : ఎన్నికల సీజన్ వ్యాపారులతో కాంగ్రెస్ కు నష్టం - వ్యాసం @DhivitiNews.com

అయితే, తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నిర్వహించబడుతున్న సంచలన యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఖాయమైన భారాస, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చేజిక్కించుకొని, "విశ్వసనీయ సమాచారం మేరకు" అనే టాగ్ లైన్ తో ఆయా పార్టీల ఖాయమైన అభ్యర్థుల జాబితాలు తమ ట్విట్టర్ వేదికగా ఆదివారం లీక్ చేసి సంచలనం సృష్టించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారాస, కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ గురించి కాస్త పక్కన పెడితే, మహబూబాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన జాబితాలో ఆశ్చర్యానికి గురయ్యే అభ్యర్థికి అవకాశాలున్నట్టు తెలిపింది. అదేంటంటే జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ కు లేదా బిజెపికి చెందిన రాష్ట్ర నాయకులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు ఎమ్మెల్యే టికెట్ అందనుందని తెలిపింది. హుస్సేన్ నాయక్ గత కొద్ది కాలంగా బిజెపి కార్యకర్తలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారని, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నవేళా Q న్యూస్ నెట్వర్క్ ఇలాంటి లీక్ చేయడం సంచలనంగా మారింది. ఇక డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి అందరూ ఊహించినట్లుగానే డా. రామచంద్రు నాయక్ కె టికెట్ కాయం చేసినట్లు Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన జాబితాలో స్పష్టం చేయబడి ఉంది.

ఏది ఏమైనప్పటికీ, Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన అభ్యర్థుల జాభితా విశ్వసనీయత ఎంతమేరకు ఉంటుందో తెలియదుగానీ, మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు ఈ సమాచారం ఊతమిచ్చిందనే చెప్పవచ్చు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :