దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థ రామకృష్ణ విద్యాలయంకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ బ్యాంకేట్ హాలులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1993-94 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొనగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ విద్యాలయ కరెస్పాండంట్ గుండోజు దేవేందర్ మాట్లాడుతూ.. చదువు విజ్ఞానంతో పాటు సంస్కారం నేర్పుతుందని, అలాంటి విజ్ఞానం, సంస్కారంతో విద్యార్థులు దేశ పౌరులుగా మారి విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. ఫలానా వ్యక్తి నా విద్యార్థే అని సగర్వంగా అధ్యాపకులు చెప్పుకునేలా విద్యార్థులు సమాజంలో ఉత్తములుగా మెలగాలని, అభివృద్ధి చెందాలని, ప్రముఖ స్థానాలలో నిలవాలని ఆకాంక్షించారు.
Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com
అనంతరం రామకృష్ణ విద్యాలయ కరెస్పాండంట్ గుండోజు దేవేందర్ తో పాటు ప్రధానోపాధ్యాయులు మహేందర్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, కృష్ణమాచారి, సుధాకర చర్య, కనకయ్య, సతీష్, ఉపాధ్యాయురాలు పద్మలను విద్యార్థులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుభాని, రాజు, చరణ్, శ్రీనివాస్, ఉషారాణి, ముస్తఫా, అనుపమ, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News