దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో "హరిత భారత్" స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు పాఠశాల ప్రిన్సిపాల్ భార్గవి రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ పట్టణ 13వ వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న హాజరయి మొక్కలను నాటి విద్యార్థులతో నాటించి మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది.
Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com
ఈ సందర్భంగా కౌన్సిలర్ బుజ్జి వెంకన్న మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండే విధంగా పౌరులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమం రూపొందించడం జరిగిందని, అందులో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఎజియం చేతన్, ఆర్ఐ జయప్రకాష్, ప్రిన్సిపాల్ భార్గవి రెడ్డి, డీన్ రమేష్, ఇంచార్జ్ ఉపేందర్, రమ్యజ్యోతి, హిమబిందు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News