దివిటీ న్యూస్ - తెలంగాణ / సూర్యాపేట : అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.
Also Read : టార్గెట్ భూపాల్ నాయక్..!!? @DhivitiNews.com
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బాలెంల గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహానికి తన సోదరుడు శ్రీధర్ రెడ్డి సహకారంతో 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గం మానవాళికి ఆదర్శనీయమన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినవాడు కాదని భారతదేశ ఐక్యతకు చిహ్నమని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకే కాకుండా అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి తన వంతు సహకారాన్ని తప్పకుండా అందిస్తానని తెలిపారు. విద్యతోనే ఏదైనా సాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలను సాధించేలా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుందన్నారు.
Admin
Dhiviti News