దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన చిలుముల ప్రసాద్ చారి కోవిడ్ మూలంగా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి దిక్కులేని స్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ కుటుంబ స్థితిని మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకుపోగా, మంత్రి స్పందించి గురువారం ఆమె క్యాంపు కార్యాలయానికి బాధిత కుటుంబ సభ్యులను ఆహ్వానించి వారి స్థితిగతులను తెలుసుకొని తక్షణ సాయంగా 10 వేల రూపాయలు అందిస్తూనే, తల్లి చిలుముల స్రవంతి కి ఏదేని గురుకుల పాఠశాలలో ఔట్సోఅర్చింగ్ ఉద్యోగంతోపాటు పిల్లల చదువుల కోసం గురుకుల సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి కుటుంబ స్థితిని తన దృష్టికి తీసుకొచ్చిన జిల్లా తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ బృందాన్ని, అలాగే ఈ విషయంలో అనుసంధాన కర్త పాత్ర పోషించిన ఐజేయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ను అభినందించారు.
Also Read : టార్గెట్ భూపాల్ నాయక్..!!? @DhivitiNews.com
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే ప్రభుత్వమని, పేదల కష్టాలు తెలిసిన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించాలని, ఆయన అడుగుజాడల్లో నడిచే తాను పేదల పక్షపాతిగా ఉంటూ సేవ చేసుకుంటూ వెళుతున్నానని, ప్రజలు భారాస పార్టీ పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐజెయు జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్, స్టేట్ కమిటీ సభ్యులు గుండోజు దేవేందర్, కోశాధికారి గుండోజు సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉపాధ్యక్షులు రవీంద్ర చారి, వెలగలేటి కిరణ్ కుమార్, రామాచారి, వినయ్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News