దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టివిబిజేఏ) ఏర్పాటయిన సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు గురువారం రోజు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ను మహబూబాబాద్ పట్టణంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Also Read : Q న్యూస్ లీక్.. ముందే చెప్పిన దివిటీ.. జిల్లా బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!! @DhivitiNews.com
ఈ సందర్భంగా టివిబిజేఏ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్ తమ యూనియన్ విధివిధానాలు, ప్రధాన లక్ష్యాల గురించి మంత్రికి వివరించారు. భవిష్యత్ లో తమ యూనియన్ కు అండగా నిలవాలని, విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ ల సమస్యల పట్ల స్పందించాలని కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ జర్నలిస్టులు సంఘటితం అయి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కారాలకు కృషి చేస్తానని, సంక్షేమానికి పాటుపడతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టివిబిజేఏ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్, స్టేట్ కమిటీ సభ్యులు గుండోజు దేవేందర్, కోశాధికారి గుండోజు సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉపాధ్యక్షులు రవీంద్ర చారి, వెలగలేటి కిరణ్ కుమార్, రామాచారి, వినయ్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News