దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పోరిక బలరాం నాయక్ మళ్ళీ నోరు జారారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తె గ్యాస్ సిలిండర్ ధర రూ. 5 వేలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.. సభికులు తప్పు సరిదిద్దే విధంగా గుర్తు చేయగా 5 వేల 500 అని.. మళ్ళీ గుర్తు చేశాక సర్దుకొని 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అర్బన్ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో ఇలా మాట్లాడారు.
Also Read : టార్గెట్ భూపాల్ నాయక్..!!? @DhivitiNews.com
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, బలరాం నాయక్ ఆయన సమక్షంలోనే ఇలా నోరు జారడంతో సభికులందరూ షాక్ కు గురయ్యారు.
Admin
Dhiviti News