దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఐజేయు జిల్లా ద్వితీయ మహాసభ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో వైభవంగా జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరవగా, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పి చైర్ పర్సన్ అంగోతు బిందు, కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
Also Read : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గ్యాస్ సిలిండర్ 5 వేలు..- కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ @DhivitiNews.com
మహాసభ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐజెయు రాష్ట్ర నాయకులు ముఖ్యులతో సమావేశం జరిపి జిల్లా నూతన కమిటీని ప్రకటించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులుగా చిత్తనూరి శ్రీనివాస్ ను వరుసగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి శ్రీహరిని, జిల్లా కోశాధికారిగా బిజ్జల వెంకటరమణను, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కల్లూరి ప్రభాకర్ ను, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులుగా పలువురు జర్నలిస్ట్ ల పేర్లను ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఆవుల యుగేందర్ వ్యక్తిగత కారణాల రీత్యా తన జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయగా ఆయనను ఐజేయు జిల్లా కార్యవర్గం, రాష్ట్ర నాయకుల సమక్షంలో సాదరంగా సన్మానించి వీడుకోలు పలకడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ కమిటీ చైర్మన్ బానోత్ రవి నాయక్, ఐజేయు జాతీయ నాయకులు కృష్ణ రెడ్డి, రాష్ట్ర బతజైకీ రాం నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి మధు, ఖమ్మం జిల్లా సీనియర్ జర్నలిస్ట్ వేణు, సీనియర్ జర్నలిస్ట్ గొడుగు శ్రీనివాస్, కల్లూరి ప్రభాకర్, ట్రైబల్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తేజావత్ రవి నాయక్, రాష్ట్ర నాయకులు రాము నాయక్, ఎస్సి జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బెధమల్ల సహదేవ్, విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News