దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ రాజకీయంగా అసెంబ్లీ స్థానాలను ఇవ్వకుంటే పార్టీలను రాజకీయ సమాధి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ హెచ్చరించారు.
Also Read : టార్గెట్ భూపాల్ నాయక్..!!? @DhivitiNews.com
మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవనంలో బీసీ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గుండగాని వేణు అధ్యక్షత వహించిన విస్తృతస్థాయి సమావేశానికి బైరి రవికృష్ణ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 60 శాతం ఉన్న బీసీలకు 23 సీట్లు బిఆర్ఎస్ పార్టీ కేటాయించడం, ఐదు శాతం ఉన్న రెడ్లకు 40 సీట్లు కేటాయించడం, అరశాతం ఉన్న వెలమలకు 11 సీట్లు కేటాయించడం దారుణం అని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలైనా జనాభా దమాషా ప్రకారము బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో సెప్టెంబర్ 10న తలపెట్టిన బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలని అన్ని కుల సంఘాలకు పిలుపునిచ్చారు. బీసీ సింహ గర్జన గోడ పత్రికను ఆవిష్కరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారపు యాకన్న, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ కార్యదర్శి యదుముల రాజమౌళి, గౌడ సంఘాల జేఏసీ కన్వీనర్ చిర్ర రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చందా గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు ప్రభాకర్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి రామరాజు ఉపేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చెన్నూరు విజయలక్ష్మి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, జిల్లా జిల్లా యూత్ అధ్యక్షులు బసనబోయిన మురళి యాదవ్, కుల సంఘ జిల్లా అధ్యక్షులు, బిసి సంఘం యువ నాయకులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News