దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : క్రీడా మైదానాలకు అలవర్చుకుంటే ఆరోగ్యంతో పాటు క్రీడలు కూడా అభివృద్ధి చెందుతాయని డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు.
Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం కన్వీనర్ కల్లూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, యువత, మాస్టారు అట్లెట్స్ మైదానాలు అలవర్చుకుని ఆరోగ్యంతో పాటు దేహధారుఢ్యాన్ని పెంపొందించుకొని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మేజర్ ధ్యాన్ చంద్ మిలిటరీలో పగలు పనిచేస్తూ రాత్రిపూట క్రీడలు ఆడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు, యువత క్రీడల్లో రాణిస్తూ నిత్యం కొంత సమయాన్ని వ్యాయామం, క్రీడలకు కేటాయించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని క్రీడల ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు యువత తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను క్రీడామైదానాలకు అలవాటుపడేలా సమయాన్ని కేటాయించాలని తద్వారా వారు విషయ పరిజ్ఞానం నేర్చుకోవడంలో చురుకుగా ఉండడమే కాకుండా విజ్ఞానవంతులుగా తయారవుతారని వారన్నారు. అలాగే 18 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. తొలుత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఆయనకు క్రీడా నివాళులర్పించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా నుంచి వివిధ క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ధ్యాన్ చంద్ హాకీ క్రీడకు పూర్తిగా మహబూబాబాద్ జిల్లాలో హాకీ క్రీడాకారులచే హాకీ మ్యాచ్ ను అతిధులు ఆడుతూ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎస్జిఎఫ్ జిల్లా సెక్రెటరీ జ్యోతి, మహబూబాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘాల బాధ్యులు పి. పుష్పలీల, చాంప్లా నాయక్, కొమ్ము రాజేందర్, బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలిశాల కుమారస్వామి, కబడి అసోసియేషన్ బాధ్యులు సురేష్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సంజీవరావు ప్రేమ్ కుమార్, యోగ అసోసియేషన్ సెక్రటరీ టి పుష్పలీల, జూడో అసోసియేషన్ సెక్రటరీ జి. రామకృష్ణ, మాస్టర్ అథ్లెట్టు రేణుక, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు. సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News