దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం ఇందిరా నగర్ తండా గ్రామ పంచాయితీ పరిధిలోని సింగిలాల్ తండా సమీపంలో నిర్మించిన వైకుంఠధామం కాంట్రాక్టర్ల కక్కుర్తిని కళ్ళకు కట్టినట్టు తెలుపుతోంది. నిర్మాణం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఈ వైకుంఠధామం వినియోగంలోకి ఎందుకు రాలేదని ఆరా తీయగా.. వైకుంఠధామం నిర్మాణంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఖననం చేయాల్సిన గద్దెలు ప్రారంభం కాకముందే బీటలువారి పెచ్చులూడిపోవడం, అలాగే స్నానాల గది రేకుల పైకప్పు పూర్తిగా ఊడిపోవడం కనిపిస్తోంది.
Also Read : అధినేత నిర్ణయాన్ని మామిడితోట ప్రయత్నాలు మార్చగలవా..?! @DhivitiNews.com
ఈ వైకుంఠధామం నిర్మాణ వ్యయం సుమారు 12 లక్షలు కాగా, ఇందులో ఇప్పటికే 8 లక్షల బిల్ క్లెయిమ్ అయినట్టు ఈ గ్రామపంచాయితీ కార్యదర్శి వెంకటేష్ తెలిపారు.
అయితే, నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించకుండా నిర్మించిన వైకుంఠధామం వినియోగానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరుకోవడం ఏంటని, అధికారులు స్పందించి ఈ వైకుంఠధామాన్ని సందర్శించి పునస్సమీక్షించి సంబంధిత వ్యక్తులపై తగు చర్యలు తీసుకొని, పునర్నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Admin
Dhiviti News