దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : కోర్టు తీర్పును ధిక్కరిస్తూ తమ భూమిలో తమ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఆలయ పనులను నిలిపివేసి సర్వే చేసి తమ భూమి వివాదాన్ని పరిష్కరించాలని రెండోసారి ఈ సోమవారం ప్రజావాణిలో దామ్యా తండాకు చెందిన భూభాధితులు బానోతు మంగ్త్యా నాయక్, బానోతు హాతిరాం, బానోతు పంతులు జిల్లా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ మండలం మల్యాల రెవెన్యూ గ్రామపంచాయతీ పరిధిలోని దామ్యా తండాకు చెందిన బానోతు మంగ్త్యా నాయక్, బానోతు హాతిరాం, బానోతు పంతులుకు చెందిన సర్వేనెంబర్ 398/ఆ/1 లో గల తమ భూమిలో తమ ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు ఆలయం నిర్మిస్తున్నారని గత ప్రజావాణి మార్చి 20వ తారీఖున ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ అట్టి వినతి పరిష్కారానికై తాసిల్దార్ ఎడి సర్వే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని.
అయితే ప్రజావాణిలో భూపాధితులు ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ తమ భూమిలో కొందరు వ్యక్తులు నిర్మిస్తున్న ఆలయ పనులను అడ్డుకోలేదని, అధికారులు సర్వే చేయడానికి వస్తే తండాలో కొందరు వ్యక్తులు అధికారులను అడ్డుకోవడం జరిగిందని, అనంతరం అధికారులను తమ కేసు విషయమై ఆరా తీయగా.. దాటవేసే సమాధానాలు చెబుతున్నారని, చేసేది లేక తమ భూమిలో ఆలయ నిర్మాణ పనులను నిలిపివేయాల్సిందిగా సర్వే చేసి తమ భూమి వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఈ సోమవారం మరో మారు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని భూబాధితులు తెలిపారు. కాగా అదనపు కలెక్టర్ డేవిడ్ సర్వే అధికారులను, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు.
Admin
Dhiviti News