దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాఖీ పండుగను గురువారం జిల్లా కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Also Read : ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ రాఖీ పండుగ వేడుకలలో చిన్నారులు అత్యధికంగా పాల్గొని జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ డేవిడ్ జిల్లా అధికారులకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించి దీవెనలు పొందారు. జిల్లా మహిళ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి నర్మద, డిడబ్ల్యూఓ హైమావతి, సిడిపిఓ డెబోరా, సఖి సెంటర్ అధికారి శ్రావణి, ఈశ్వరి బ్రహ్మ కుమారి సమాజం మహిళా ప్రతినిధులు పలు మహిళా అధికారులు కలెక్టర్ కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. అనంతరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. మహిళలకు రక్షణగా నిలవాలనే గొప్ప ఉద్దేశంతో రాఖీ పండుగ ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా అన్నా చెల్లెలు బంధంతో తోడబుట్టిన రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. తద్వారా సమాజం సంస్కృతి సంప్రదయాలతో విలసిల్లు తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ నాగవాణి, మహిళ శిశు సంక్షేమ అధికారి హైమావతి, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యానశాఖ అధికారి సూర్యనారాయణ, ఉపాధి కల్పన అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News