దివిటీ న్యూస్ - తెలంగాణ / సూర్యాపేట : రాబోయే ఎన్నికల్లో తుంగతుర్తి లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని, కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, సెప్టెంబర్ 17 న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభను వినయవంతం చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రామడుగు నవీన్ అన్నారు.
Also Read : షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com
తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండా రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణను సిద్దం చేసినట్టు ఆయన తెలియజేశారు. గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా సరే.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ నాయకత్వంలో పార్టీ గెలుపే లక్ష్యంగా సోషల్ మీడియా పని చేయబోతుంది తెలిపారు. తెలంగాణ రాష్టం ఇచ్చిన సోనియా గాంధీకి మనం అండగా నిలవాలని, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి పేదడికి 5 లక్షల రూపాయలు, నిరుద్యోగులకు ఏకకాలంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 4 వేల భృతి అందిస్తామని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, గ్రామాలలో రైతులకు ఈ ఐదు హామీలను వివరించాలని సూచించారు. 17న జరగబోయే విజయభేరి సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల కోఆర్డినేటర్ కొత్తపల్లి ఉపేందర్, నాగారం మండల కోఆర్డినేటర్ కొలిపాక సాయి, తుంగతుర్తి మండల కోఆర్డినేటర్ చింతకుంట్ల హరీష్, మద్దిరాల మండల కోఆర్డినేటర్ మహేష్, జాజిరెడ్డిగూడెం మండల కోఆర్డినేటర్ జయంత్, మోత్కూరు మండల కోఆర్డినేటర్ బందెల రవి, నుతనకల్ మండల కోఆర్డినేటర్ బోల్క సైదులు, అడ్డగుడుర్ మండల కోఆర్డినేటర్ నవీన్, శాలిగౌరారం మండల కోఆర్డినేటర్ అనిల్ పాల్గొన్నారు.
Admin
Dhiviti News