దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన వ్యూహాన్ని అమలు చేస్తూ వడివడిగా ఎన్నికల రణరంగానికి దూసుకెళుతున్నారు. ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను ఆకర్షిస్తూ బిఆర్ఎస్ కండువా కప్పుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. మంగళవారం నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామానికి చెందిన సుమారు 100 మంది ఇతర పార్టీల కార్యకర్తలను బిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తూ చేరికల పర్వానికి తెరలేపారు.
Also Read : అధినేత నిర్ణయాన్ని మామిడితోట ప్రయత్నాలు మార్చగలవా..?! @DhivitiNews.com
నెల్లికుదురు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వంద మంది ఇతర ఆపార్టీలకు చెందిన కార్యకర్తలు భారాస పార్టీలో చేరడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గంలో మూడో సారి బీఆర్ఎస్ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని, కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News