దివిటీ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : గత కొంతకాలంగా మీడియాలో కొనసాగుతున్న ఊహాగానాలకు వైఎస్ షర్మిల చెక్ పెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ లో తన వైఎస్ఆర్టీపి పార్టీ విలీనానికి ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల డెడ్ లైన్ విధించింది.
Also Read : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గ్యాస్ సిలిండర్ 5 వేలు..- కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ @DhivitiNews.com
కాంగ్రెస్లో పార్టీ విలీనంపై ఈ సెప్టెంబర్ 30 తారీకు లోపు నిర్ణయం తీసుకొని స్పష్టం చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని తెలిపారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించిన షర్మిళ తన పార్టీ విలీనం, త్వరలో జరగనున్న ఎన్నికలపై వ్యూహాత్మక ప్రణాళిక గురించి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని షర్మిల స్పష్టం చేశారు. అయితే అది కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనం జరగకపోతేనే అన్నట్టుగా ప్రకటించింది. ప్రజాక్షేత్రంలో అక్టోబర్ రెండో వారం నుంచి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నమ్ముకున్న కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Admin
Dhiviti News