దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తమ గౌరవ వేతనం పెంచడంతో పట్టాన పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షురాలు ఎస్.కె. జహీరా సుమారు 50 మంది మెప్మా ఆర్పీలు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో పాటు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com
ఈ సందర్భంగా మెప్మా రిసోర్స్ పర్సన్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షురాలు ఎస్.కె. జహీరా మాట్లాడుతూ.. తమ ఆర్పీల జీవన స్థితిని అర్థం చేసుకొని రూ. 4,000 లు ఉన్న గౌరవ వేతనాన్ని ఈ నెల 26న రూ. 2,000 లు పెంచి రూ. 6,000 లు గా నిర్ణయించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు రుణపడి ఉంటామని, కేసీఆర్ ప్రభుత్వానికి తామంతా అండగా నిలుస్తామని ప్రకటించారు. అలాగే తమ గౌరవ వేతన పెరుగుదలకు కృషి చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం. శ్రీలక్ష్మి, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి, వసంత, స్రవంతి, ఎస్. ఉమ, రాజేశ్వరి, శ్యామల, పి. పద్మ, సరిత, విద్యావతితో పాటు సుమారు 50 మంది ఆర్పీలు పాల్గొన్నారు.
Admin
Dhiviti News