దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖల మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు తెలిపారు. గురువారం డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడలో తొర్రూరు, మరిపెడ వంద పడకల ఆసుపత్రుల శంకుస్థాపన మహోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంకలతో కలిసి మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.
Also Read : సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక్కొక్క 100 పడకల ఆసుపత్రి సుమారు 36 కోట్లతో నిర్మించనున్నామని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, 40 మంది డాక్టర్లు రానున్నట్లు తెలియజేశారు. తమ ప్రభుత్వం రాకతో 3 వేల తండాలు గ్రామపంచాయతీలుగా మారాయని, 12 లక్షల 70 వేల మందికి కళ్యాణ లక్ష్మీ పథకం కింద 11 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కాన్పుకు రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్లు అందజేసి అదేవిధంగా సగౌరవంగా ఇంటికి సాగనంపుతున్నామని తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో 1100 కోట్లతో హెల్త్ సిటీ ని 24 అంతస్థులతో 2వేల పడకలతో నిర్మిస్తున్నామని, తద్వారా కిడ్నీ, లివర్ మార్పిడి చేయించుకోవచ్చని, గుండె ఆపరేషన్లు నిర్వహించుకోవచ్చని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ రాష్ట్రానికి రాకపోవడం బాధాకరమన్నారు. బోరు బావులకు మీటర్లు పెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిన ఒక రైతు బిడ్డగా రైతు కష్టం తెలిసిన వారుగా ముఖ్యమంత్రి రైతులకు అండగా ఉండాలని 30 వేల కోట్లు నిలుపుదల చేసిన ప్రభుత్వం భరిస్తూ రైతులకు భరోసాని ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... జిల్లాలో గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు ఒకప్పుడు డోర్నకల్ మరిపెడలలో త్రాగునీటి కొరత అధికంగా ఉండేదని కాళేశ్వరం నీటితోనే వేతలు తీరాయి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బలగం సినిమాలో కట్టుబడి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలన్నారు తన వంతు బాధ్యత తీసుకుంటానని పదవులు శాశ్వతం కాదని మాట ఇస్తున్న అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలతో జిల్లా అభివృద్ధి వేగవంతం అయిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తండాలకు వెలుగు వచ్చిందని, 97 గ్రామపంచాయతీలు తో గిరిజనులు రాజ్యమేలుతున్నారని, 200 కోట్లతో ప్రతి తండాకు తారు రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. ఆరు శాతంగా ఉన్న ఉద్యోగ రిజర్వేషన్లను 10% వరకు పెంచుకోగలిగామని, ఒకప్పుడు త్రాగునీటితో అల్లాడిన ప్రజలు కాలేశ్వరం ప్రాజెక్టుతో ఆ కొరత తీరిందని, ఇంటింటికి త్రాగునీరు అందించామని తెలియజేశారు. జిల్లాలోని 40 శాతంగా ఉన్న ఎస్టీ జనాభా అభివృద్ధిలో భాగంగా అదనంగా వేల ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఎస్సారెస్పీ చివరి వరకు నీరు అందించాల్సి ఉందని అందుకు సహకారం కావాలన్నారు. డోనకల్ శాసనసభ్యులు రెడ్యానాయక్ మాట్లాడుతూ.. కాలేశ్వరం నీటితో ఈ ప్రాంతం రైతాంగం రెండు పంటలు పండిస్తూ సుభిక్షంగా ఉన్నారని రెండు జాతీయ రహదారులతో ఈ ప్రాంత అభివృద్ధి శరవేగంగా ఉందన్నారు. గ్రామాలన్నింటికీ రహదారులను నిర్మించి అభివృద్ధి పరచామని, వ్యవసాయ పంపు సెట్లు 40 నుండి 50 వేల వరకు ఉన్నాయని, 24 గంటల ఉచిత విద్యుత్ తో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ ఉపాధ్యక్షులు బండ ప్రకాష్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎంపీ రాజ్యసభ వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్, ఇల్లందు శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, హరిప్రియ, బిఆర్ఎస్ రాష్ట్ర సెక్రటరీ నూకల నరేష్ రెడ్డి, ఆరోగ్యశ్రీ చైర్మన్ సుధాకర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మున్సిపల్ చైర్మన్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News