Monday, 26 February 2024 08:19:10 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

ఉపాధి హామీలో ఫేక్ హాజరుకు చెక్..!! @DhivitiNews.com

#DhivitiNews, #EGS, #Employment Guarantee Scheeme

Date : 03 April 2023 07:33 PM Views : 59

దివిటీ న్యూస్ - తెలంగాణ / : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తుండగా, కొత్తగా ఫేక్ హాజరుకు చెక్ పడేలా చర్యలు చేపట్టింది గతంలో ఉపాధి హామీ కూలీల హాజరు మస్టర్లలో నమోదు చేసేవారు. దాంతో ఒకరికి బదులు మరొకరు పనికి హాజరు కావడం ఒకరే రెండు సార్లు సంతకాలు చేయడం వల్ల ఫేక్ హాజరుతో ప్రభుత్వ సొమ్ముకు గండి పడుతున్నది దీన్ని అరికట్టడానికి ప్రత్యేక యాప్ను సిద్ధం చేసి జియో కనెక్షన్తో ఉన్న సీయూజీ (కామన్ యూజర్ గ్రూప్) సిమ్ కార్డులను అందజేస్తున్నది.

ఉపాధి హామీ కూలీల హాజరు పారదర్శకంగా నిర్వహించేందుకు సీయూజీ సిమ్ కార్డులు అందజేస్తుంది అందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 970 మందికి మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు డీఆర్డీఓ ద్వారా సిమ్ కార్డులు అందజేస్తున్నారు ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు రెండు సార్లు కూలీల ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది రెగ్యులర్గా కూలీల పేర్లు ఫొటోలతో కలిపి అప్లోడ్ చేస్తేనే వారికి కూలీ అందుతుంది అయితే ముందు రోజే కూలీల డిమాండ్ బట్టి మస్టర్ సంబంధిత సిబ్బందికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇండెంట్ పెడితే దాని ఆధారంగా వారి పేర్లతో కలిపి మస్టర్ సదరు యాప్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లో డౌన్లోడ్ అయిన కూలీల పేర్ల స్థానంలో క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది. దాంతో ఉపాధి పనులకు హాజరు కాని వారి పేర్లను ఈ యాప్లో నమోదు చేయడానికి అవకాశం ఉండనందున్న ఫేక్ హాజరుకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఈ యాప్తో ఇక నుంచి ఒకరికి బదులు మరొకరు సంతకాలు పెట్టే అవకాశం ఉండదు.

ఉపాధి కూలీ వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006ఫిబ్రవరిలో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టగా ఆరంభంలో కూలీలకు రెగ్యులర్గా రూ.49 కూలీగా చెల్లించింది. కాలానుగుణంగా అది పలు సార్లు పెరగ్గా ప్రస్తుతం రోజు వారి కూలీ రూ.257గా అమలు అవుతుంది. అయితే కూలీల వేతనం పెంచాలని చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా ప్రస్తుత కూలీకి మరో రూ.15 పెంచింది. దీన్ని శనివారం నుంచి అమలు చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ యంత్రాంగాన్ని ఆదేశించింది నల్లగొండ జిల్లాలో 3,52,872 జాబ్ కార్డులు ఉండగా 7,59,779 మంది కూలీల రిజిస్టర్ చేసుకున్నారు వారిలో ప్రస్తుతం జిల్లాలో రెగ్యులర్గా 45మంది సగటున కూలీలు హాజరవుతుండగా గరిష్టంగా లక్షకు పైగా వేసవి సమయంలో హాజరు కానున్నారు. అయితే కొవిడ్ సమయంలో మాత్రం 1.61లక్షల మంది హాజరయ్యారు. ఫేక్ హాజరు అరికట్టేందుకు సిమ్ కార్డులు ఉపాధి హామీ పథకంలో ఫేక్ హాజరు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు కొవిడ్కు ముందే ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ను అమల్లోకి తెచ్చింది. అయితే ఫీల్డ్ అసిస్టెంట్లు తమ డిమాండ్లతో సమ్మెకు వెళ్లడంతో ప్రభుత్వం వారిని విధుల్లో నుంచి తొలగించి సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నది. అప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించగా వారు కూలీల హాజరు మాన్యువల్గానే తీసుకున్నారు దాంతో మళ్లీ కూలీల హాజరు ఫేక్గా నమోదై అవకతవకలు జరిగాయి ఈ తరుణంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి వచ్చారు దాంతో ప్రభుత్వం మరోసారి వారికి స్వాధీనం చేసుకున్న సీయూజీ సిమ్ కార్డులు అందజేస్తుంది. పారదర్శకత కోసం సిమ్ కార్డులు ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఫీల్డ్ అసిస్టెంట్లకు సిమ్ కార్డులు అందజేస్తున్నాం ప్రతి రోజు పని ప్రదేశంలో పని ప్రారంభంతో పాటు పని పూర్తి కాగానే ఫొటోలు తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. దాంతో ఒకరికి బదులు మరొక కూలీ హాజరు కావడం, సంతకం పెట్టడం లాంటివి జరగడానికి అవకాశం ఉండదు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్లు దీన్ని రెగ్యులర్గా అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో కనీసం వంద మంది కూలీలు పనికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :