దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనదైన స్టైల్ లో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పథకాలను అందిస్తూ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Also Read : శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com
శుక్రవారం కేసముద్రం మండలంలో పర్యటించిన శంకర్ నాయక్.. ఇంటికన్నె గ్రామంలో 211 లక్షల రూపాయల నిధులతో ఇంటికన్నె నుండి నక్కల గుట్ట తండా వరకు బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, ఇంటికన్నె గ్రామానికి చెందిన లబ్ధిదారులకు గృహాలక్ష్మి పథకం పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం, వెంకటగిరి గ్రామం చంద్రు తండాలో పర్యటించి 80 లక్షల రూపాయల నిధులతో చంద్రుతండా నుండి స్మశానవాటిక వరకు బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, వెంకటగిరి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు గృహాలక్ష్మి పట్టాలను పంపిణీ చేశారు.
కేసముద్రం స్టేషన్, ఉప్పరపల్లి గ్రామాలలో పలువురు మృతి చెందగా మృతుల కుటుంబాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్ధిక సాయం చేశారు. అలాగే, ఈ గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం మీద రెండు సార్లు ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ నుండి పోటీచేసి గెలిచి.. మూడో సారి సైతం పార్టీ టికెట్ సాధించి నియోజకవర్గంలోని ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల కంటే జెట్ స్పీడ్ లో పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఏకబిగిన డిజైన్ చేసుకొని మరీ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ కార్యక్రమంలో ఎంపిపి వొలం చంద్ర మోహన్, జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సరిత - రమేష్, సత్యనారాయణ రావు, నీలం దుర్గేష్, కముటాం శ్రీను, రవీందర్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మండల, గ్రామ భారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News