దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : దందాలు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ BRS, కాంగ్రెస్ పార్టీలని మహబూబాబాద్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు.
Also Read : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గ్యాస్ సిలిండర్ 5 వేలు..- కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ @DhivitiNews.com
శనివారం ఆయన మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం బోజ్యా తండా, నల్లగుట్ట తండా, జాదు తండా, సపవట్ తండా, రత్తిరాం తండా, జామ తండా, ఇతర తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండాల్లో హుస్సేన్ నాయక్ కు మహిళలు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
అనంతరం హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ నీళ్ళు, నిధుల, నీయమకాల పేరిట ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నాడని, రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం దోచుకుంటే, మానుకోటలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూ కబ్జాలు చేస్తూ దోచుకుంటున్నారని, తెలంగాణ లో కెసిఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నేరవెర్చలేదని, అలీబాబా 40 దొంగలు అన్నట్టు ఒక్క కెసిఆర్ 100 హామీలు ఇచ్చి మోసం చేసిండని అన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉత్త హామీలు ఇస్తుందని, గత ఎన్నికల్లో కెసిఆర్ సారు కారు 16 అని మోసం చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇస్తుందని, 60 పాలించిన పార్టీ అధికరంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తదంట, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ను నమ్మరని, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలవడం ఖాయం సర్కార్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
Dhiviti News