Monday, 26 February 2024 07:05:32 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com

#Yashaswini #YerrabelliDayakarRao #JhansiReddy

Date : 25 November 2023 01:34 PM Views : 333

దివిటీ న్యూస్ - రాజకీయాలు / మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గం.. ఈ పేరు చెప్పగానే ఓటమి ఎరుగని ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు గుర్తుకు వస్తుంది. అధికార, ప్రతి పక్షం ఏ పార్టీలో వున్నా ఎర్రబెల్లి ఇప్పటివరకు ఓటమి ఎరిగింది లేదు. కానీ ఈ ఎన్నికల్లో పాలకుర్తిలో ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Also Read : వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com

గత ఎన్నికలో తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే పక్క నియోజకవర్గ నాయకుల గెలుపు కోసం ప్రచారానికి వచ్చిన నేత నేడు ఆ పరిస్థితి కనబడటం లేదు. పాలకుర్తి నియోజకవర్గంలో రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలతో అయన రాజకీయ చతురత పాచికలు పారడం లేదని సమాచారం. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత, మాజీ గులాబీ నేతలు ఒక్కటై బిఅరెస్ ఓటమికి ఎత్తులతో కాంగ్రెస్ అభ్యర్థి కోడలు యశస్వినీ పై అత్త ఝన్సీరెడ్డి చేసిన సేవలు ప్రజల్లో గుర్తుండిపోయేలా చూపిన చారిటీ పనులు తెలంగాణ రాష్ట్ర సమితి పై వ్యతిరేకత వెరసి పాలకుర్తిలో ఈ సారి యశస్విని హస్తం వైపు గాలి మళ్లిందని సమాచారం. దయాకర్ రావు వెన్నంటి వున్న నాయకులు కక్కిరాల, సోమన్న, బుడుగ జంగాల నాయకులు ఆయనకు దూరం అవ్వడం దెవురుప్పల జనగామ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు గులాబీకి పూర్తిగా వ్యతిరేకం అవుతున్నాయని, మహబూబాబాద్ జిల్లాలోని రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగరలో కొంత దయాకర్ రావుకు బలంగా వున్నా ఎన్నికల నాటికీ అది ఎవరికీ ఎటు తిరుగుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉన్నపటికీ, ఝాన్సీరెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తో అది కొట్టుకొని పోవొచ్చని నాయకులు విశ్వసిస్తున్నారు. ఈసారి ప్రజల్లో మార్పు కావాలని బలంగా అనుకుంటున్నారని, 10 ఏండ్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి చెప్పుకొనే విధంగా లేదని, వున్నా కేవలం 5 మండలాలలో తొర్రూరును తప్ప మిగిలిన వాటిని అభివృద్ధి చేయలేదని, దీనికి తోడు ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఆయిల్ ఫామ్ తోటలు వేశారని, అధికార పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు వెలువెట్టెతున్నాయి. అంతేకాకుండా దళిత బంధు, గృహలక్ష్మి పథకాలలో అర్హులకు అన్యాయం చేశారని క్రింది స్థాయి నాయకులు దళిత బంధు పథకంలో చేతివాటం ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏది ఎమైనా ఈఎన్నికలు ఇటు ఎర్రబెల్లికి, అటు హానుమండ్ల ఝాన్సీరెడ్డికి సవాళ్లుగా మారాయి. ఎన్నికల నాటికి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడుతారో ఎవరిని ఇంటికి పంపిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

Admin

Admin

Dhiviti News

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :