Monday, 26 February 2024 09:17:03 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

వందేభారత్ (సికింద్రాబాద్ - తిరుపతి) టికెట్ ధరల వివరాలు ఇవిగో..!!

#Dhiviti, #DhivitiNews, #VandeBharath, #Tirupathi

Date : 08 April 2023 07:18 PM Views : 193

దివిటీ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఆదివారం నుంచి రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఖరారు చేసిన టికెట్ ధరలను పరిశీలిద్దాం. దూరాన్ని, ప్రయాణించే బోగీని బట్టి ధరలు నిర్ణయించారు. కనిష్ఠ ధర రూ. 470 కాగా, గరిష్ఠంగా రూ. 3,080 గా ఖరారయ్యింది. సికింద్రాబాద్-తిరుపతికి చైర్ కారు టికెట్ ధర రూ. 1,680. తిరుపతి - సికింద్రాబాద్ కంటే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి టికెట్ ధర రూ. 50, రూ. 55 అధికంగా ఉంది. తిరుపతి నుండి సికింద్రాబాద్ రైలు, సికింద్రాబాద్ నుండి రుపతి రైలు ప్రయాణికులకు రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తొలుత 8 బోగీలతోనే నడువనుండగా, ఇందులో 7 ఏసీ చైర్ కార్లు, ఒకటి ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంటాయని సమాచారం. మొత్తం 530 మంది ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. డిమాండును బట్టి కోచ్లను పెంచే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ రైళ్లకు ఇప్పటికే బుకింగులు ప్రారంభం కాగా తిరుపతి నుంచి బయలుదేరే తొలి రైలులో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ కోచ్ లోనీ సీట్లు నిండిపోయి వెయిటింగ్ లిస్టుకు చేరుకున్నాయి.

సికింద్రాబాద్ నుంచి చైర్కార్, ఎగ్జిక్యూటివ్ ధరలు వరుసగా.. * నల్గొండకు రూ. 470, రూ. 900, * గుంటూరుకు రూ. 865, రూ. 1,620, * ఒంగోలు రూ. 1,075, రూ. 2,045, * నెల్లూరు రూ. 1,270, రూ. 2,455, * తిరుపతి రూ. 1,680, రూ. 3,080,

తిరుపతి నుంచి చైర్కార్, ఎగ్జిక్యూటివ్ ధరలు వరుసగా * నెల్లూరుకు రూ. 555, రూ. 1,060, * ఒంగోలు రూ. 750, రూ. 1,460, * గుంటూరు రూ. 955, రూ. 1,865, * నల్గొండ రూ. 1,475, రూ. 2,730, * సికింద్రాబాద్ రూ. 1,625, రూ. 3,030

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :