దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : గత కొంత కాలంగా మహబూబాబాద్ ఎంపీ, భారాస జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గాల మధ్య సఖ్యత లేదు. అందుకు కారణం వారిద్దరి మధ్య చోటుచేసుకున్న పలు వివాదాస్పద ఘటనలే.. ఓ బహిరంగ సభలో ఎంపీ కవిత ప్రసంగిస్తుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతుల్లోంచి మైక్ లాక్కున్న ఘటన, భారాస జిల్లా కార్యాలయం పనుల క్రెడిట్ విషయంలో ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం, ఫ్లెక్సీల చించివేత రగడ లాంటి ఘటనలు వీరిద్దరి మధ్య వర్గపోరును బహిర్గతం అయ్యి, రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశాలుగా మారాయి.
Also Read : కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటే.. నన్ను గెలిపించాలి - ఎమ్మెల్యే రెడ్యా నాయక్ @DhivitiNews.com
అయితే, తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటూ చర్చలకు తావిచ్చే ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు ఒకే వేదికపై ఆశీనులై ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని మాట్లాడుకోవడం పార్టీ క్యాడర్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడే కలిసిపోయి, ఆవెంటనే వివాదాలకు తావిచ్చే వీరి మధ్య సఖ్యత ఎంతకాలం ఉంటుందో.. మళ్ళీ ఏ వివాదంతో చర్చలకు తావిస్తారో అని వీరి ఆత్మీయ పలకరింపులు చూసినవారు చెవులు కోరుకున్నారు.
నాయకుల మధ్య వివాదాలు, రాజకీయపరమైన శత్రుత్వాలు ఎంత సాధారణమో, పార్టీ ఆదేశాలు, రాజకీయ అవసరాల రీత్యా బద్ధ శత్రువులైనా కలిసిమెలిసి పనిచేయాల్సిరావడం సైతం అంతే సర్వ సాధారణమని, నాయకుల మధ్య గొడవలు శాశ్వతం కావని వారి గొడవల మూలంగా వర్గాలుగా విడిపోయి శత్రుత్వం పెంచుకొనే వారి వారి అనుచరులు ఇప్పటికైనా గుర్తించాలి.
Admin
Dhiviti News