Monday, 26 February 2024 07:06:26 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

ఆ విషయంలో హైదరాబాద్ దూసుకొళ్తోంది..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Hyderabad, #Telangana

Date : 20 April 2023 11:18 PM Views : 57

దివిటీ న్యూస్ - తెలంగాణ / : హైదరాబాద్ నగరం అన్ని విషయాల్లో ముందుంటున్నప్పటికీ జనాభాలోనూ తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని జనాభా 1.05 కోట్లకు చేరుకుందని ఈ సంవత్సరం చివరి నాటికి ఆ సంఖ్య 1.08 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం తాజాగా అంచనా వేసింది. జనాభా పరంగా భాగ్యనగరం దేశంలో 6వ స్థానంలో, ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచినట్లు స్పష్టం చేసింది.

Also Read : రాజమౌళి (SS Rajamouli), శంకర్ (Shanker) మధ్య తేడాలివే... ఎవరు ది బెస్ట్?? @DhivitiNews.com

రాష్ట్రంలో పెరిగిన పట్టణీకరణతో రాష్ట్ర జనాభాలో 3వ వంతు రాజధానిలోనే నివాసం ఉంటోందని గణాంకాలు తెలుపుతున్నాయి. 1950 ప్రాంతంలో హైదరాబాద్ జనాభా సుమారు 10 లక్షలకు పైగా ఉండగా.. 1975 నాటికి ఆ సంఖ్య 20 లక్షలు దాటేసింది. ఆ తర్వాత మరో పదిహేనేళ్లలో (1990 నాటికి) సుమారు 40 లక్షలకు పైగా పెరిగింది. ఆ తర్వాత మరో 20 ఏళ్లలో (2010 సంవత్సరం నాటికి) 80 లక్షలకు చేరుకుంది. ప్రస్తుత సంవత్సరానికి జనాభా సంఖ్య కోటి దాటేసింది.

ఒకప్పుడు భాగ్యనగరం అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీహెచ్) పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏర్పాటుతో ఆ పరిధి పెరిగి 650 చదరపు కిలోమీటర్లకు నగరం విస్తరించింది. దీనిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. ఉపాధి రీత్యా ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది నగరానికి వలస వచ్చి.. ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు . రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య వార్షికంగా 4.07 లక్షలు కాగా, పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య 88,216గా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం అంచనా వేసింది.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :