దివిటీ న్యూస్ - తెలంగాణ / : ఖమ్మం జిల్లా రాజకీయ దిగ్గజం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై భారాస వేటు వేయడంతో గులాభీ పార్టీకి ఊహించినట్టుగానే షాక్ లు తగలడం మొదలయ్యాయి. పొంగులేటి ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని, ఇది కేవలం ఖమ్మం జిల్లాతోనే ఆగదని పొరుగు జిల్లాలకూ పాకుతుందని రాజకీయ విశ్లేషకులు ఊహించినంత అయ్యింది. పొంగులేటి ఎఫెక్ట్ తో ఖమ్మంకు పొరుగు జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లా నుండే మొదటి షాక్ గులాభీ పార్టీకి తగిలింది.
Also Read : గిప్పుడు మనం దోస్తులం.. ఓకేనా..!! @DhivitiNews.com
మహబూబాబాద్ జిల్లా గార్ల జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ బుధవారం రోజు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెన్షన్కు గురైన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఘటనకు నిరసనగా పొంగులేటి మద్దతుగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇటీవల గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
పొంగులేటి ఎఫెక్ట్ పొరుగు జిల్లాలకు తగులుతుందని ఊహించినా మొదట మహబూబాబాద్ జిల్లాకే తగలడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ షాక్ లు ఏ ఏ జిల్లాలకు విస్తరించనున్నాయో అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయంగా మారాయి.
Admin
Dhiviti News