దివిటీ న్యూస్ - సినిమా / : ఇటీవల మంచు మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో తన అన్న తనవాళ్లను ఇలా చేయిచేసుకుంటూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు అంటూ మనోజ్ ఇంట్లో మంచు విష్ణు మనోజ్ కు సంబంధించిన వ్యక్తిపై చేయి చేసుకుంటూ దురుసుగా ప్రవర్తించే వీడియోను షేర్ చేసేసి, తరువాత డిలీట్ చేయడం, ఆ విషయాన్ని మన టివి చానెల్స్ విరివిగా వాడేయడం, చర్చలు నిర్వహించడం, పాపం మనోజ్ అంటూ మనోజ్ పై సింపతీ, డర్టీ విష్ణు అంటూ విష్ణుపై ఏవగింపు ప్రదర్శించి పోస్టులు పెడుతూ నెటిజెన్లు వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టులు పెట్టేసారు.
అయితే అదంతా మంచువారి రియాలిటీ షో అంటూ మరో వీడియోను పోస్ట్ చేసి మంచు విష్ణు నెటిజెన్లకు, టివి ఛానెల్స్ కు షాక్ ఇచ్చేసాడు. ఈ తతంగం అంతా చుసిన నెటిజెన్లు తమ విలువైన సమయాన్ని ఈ మంచు సోధికి వృధా చేసేసాం అంటూ మంచు ఫామిలీ పై మళ్ళీ ట్రోల్ల్స్ మొదలెట్టేసారు. మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ కు నెటిజెన్లలో కనీసం ఒక మంచి అభిప్రాయం, ఇమేజ్ ఉండేది, తన అన్న ఇలాంటోడు అంటూ వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి డిలీట్ చేసి, తరువాత అది ఒక రియాలిటీ షో అంటూ మంచు విష్ణు ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఇదంతా ఏంటని, మంచు మనోజ్ పై ఉన్న మంచి అభిప్రాయం ఆయనే పోగొట్టుకుంటున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మంచు వారి రియాలిటీ షో ఎలా ఉంటుందో కానీ, మంచు మనోజ్ మాత్రం నెటిజెన్లలో, యూత్ లో తనకున్న మంచి ఫాలోయింగ్ ను ఈ రియాలిటీ షో అప్డేట్ తో కొంతమేర చెడగొట్టుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Admin
Dhiviti News