Thursday, 07 December 2023 10:28:37 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

నెహ్రూ నాయక్ బరిలో దిగితే.. కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశాలు @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #NehruNaik, #Dornakal, #TSElections2023

Date : 03 May 2023 11:26 PM Views : 562

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : డోర్నకల్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యా నాయక్ ది తిరుగులేని ప్రస్తానం. పార్టీ ఏదైనా దశాబ్దాల తరబడి ఎమ్మెల్యే పీఠాన్ని అంటిపెట్టుకున్న చరిత్ర ఆయనది. దీనికి ముఖ్య కారణం ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పటికీ తన సొంత గ్రామం (తండా)లోని తన సొంత నివాసంలో నివసిస్తూ నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉండడం. పార్టీ మారినా ఈ ముఖ్య లక్షణమే రెడ్యా నాయక్ ను పార్టీలకతీతమైన ప్రజాధారణ పొందేలా చేసింది అందడంలో అతిశయోక్తి లేదు. అయితే, రెడ్యాకు ఉన్న సానుకూల అంశాలలో అతి ముఖ్యమైన స్థానికత, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి.. అంశాలు కలిగిన పోటీదారు ఒక్క సత్యవతి రాథోడ్ తప్ప మరొకరు డోర్నకల్ నియోజకవర్గంలో లేకపోవడం, ప్రస్తుతానికి సత్యవతి రాథోడ్ సైతం రెడ్యా ఉన్న పార్టీలోనే ఉండడంతో పార్టీ టికెట్ సంపాదిస్తే రెడ్యా గెలిచినట్లే అనే భావన ప్రజల్లో నెలకొని ఉంది.

Also Read : పొరుగు జిల్లాలకు పొంగులేటి ఎఫెక్ట్..!! గులాబీ పార్టీకి మొదలైన షాక్ లు @DhivitiNews.com

స్థానికత అంశంతో రెడ్యాకు గట్టి పోటీ..: డోర్నకల్ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బలమైన పార్టీ కాంగ్రెస్.. వర్గపోరు, స్థానికేతర అభ్యర్థి అంశాలు మాత్రమే గత రెండు దఫాలుగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూస్తూ రెడ్యా గెలుపుకు పరోక్షంగా కారణమవుతూ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతూంటారు. అయితే, రెడ్యా స్థానికత అంశం గతంలా మిగిలిపోయేలా ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ తరుపున స్థానిక బలమైన ప్రజాధారణ కలిగిన నాయకులు మాలోత్ నెహ్రు నాయక్ కాంగ్రెస్ డోర్నకల్ బరిలో నిలిచే అవకాశాలు ఉండడం. నెహ్రు నాయక్ డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండలం లింగ్యా తండాకు చెందిన వ్యక్తి కావడంతో ఒకవేళ కాంగ్రెస్ తరుపున ఆయనను డోర్నకల్ బరిలో నిలిపితే.. గత ఎన్నికల్లో స్థానికత అనే ప్రతికూల అంశం రాబోయే ఎన్నికల్లో బలహీనపడిపోవడం ఖాయం. ఇక వర్గపోరును నివారించగలిగితే రాబోయే ఎన్నికల్లో రెడ్యా నాయక్ ను ఓడించగలిగే శక్తి నెహ్రు నాయక్ రూపంలో కాంగ్రెస్ కు రెట్టింపవుద్ది అనడంలో సందేహమే లేదు. పైపెచ్చు నెహ్రు నాయక్ కు ఏ పదవి లేనప్పటికీ నియోజకవర్గ ప్రజల సాధకబాధకాల్లో పాలుపంచుకుంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఆర్థికంగా తనవంతు సహకారం అందిస్తూ ప్రజాధారణ విషయంలో ముందుకు దూసుకుపోతూండడం గమనించదగ్గ విషయం.

కాంగ్రెస్ లో మరో అభ్యర్థికి లేని సానుకూలతలు... : గత రెండు దఫాలుగా కాంగ్రెస్ తరుపున రెడ్యాతో తలపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ స్థానికేతరుడు కావడం, రెండు దఫాలుగా ఆయన ఓటమికి స్థానికత అంశమే ముఖ్య కారణమని నియోజకవర్గంలో టాక్.. అయితే, ఈసారి సైతం ఆయనే కాంగ్రెస్ పార్టీ తరుపున మరోమారు టికెట్ కోసం ప్రయత్నిస్తుండడం, నెహ్రు నాయక్ మినహా డోర్నకల్ టికెట్ ఆశావాహుల్లో మరే ఇతర నాయకులు స్థానికులు కాకపోవడం, నెహ్రు నాయక్ కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. ఏది ఏమైనా ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయంపైనే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది అనడంలో అభ్యంతరం ఏమి లేదని భావించవచ్చు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :