Thursday, 07 December 2023 09:16:48 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

చెరిగిపోని "మారోజు" స్ఫూర్తి..!! @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #MarojuVeeranna, #LifeBio, #SrinivasGundoju

Date : 16 May 2023 09:52 AM Views : 407

దివిటీ న్యూస్ - ఎడిటోరియల్ / : “జంబూ ద్వీపాన్ని ఆర్పి ద్రవిడ నాగరాజ్యాన్ని కూల్చివేయవచ్చు.. సింధూను ధ్వంసం చేసి నాగరికతను నాశనం చేయవచ్చు.. పాళీ గ్రంధాలను తగులబెట్టి చరిత్రను చెరిపేయవచ్చు.. ఆట, పాట, మాటను కూనిజేసి సంస్కృతిని సమాధి చేయవచ్చు.. వీరులను అంతం చేసి యుద్ధాన్ని ఆపేయవచ్చు.. కానీ రోజునెవ్వడురా ఆపేది.. “మారోజు”నెవ్వడురా ఆపగలిగేది??” ఇది మారోజు వీరన్ననుద్దేశించి ఆయన అభిమాన పీడిత ప్రజల మస్తిష్కం నుండి ఉద్భవించిన విప్లవ కవిత..

Also Read : “ప్రాజెక్ట్ కె” షూటింగ్ కు అంతరాయం.. కారణం అదే..! @DivitiNews.com

మారోజు వీరన్న.. ఈ పేరు వింటే తెలంగాణాలోని దళిత, గిరిజన, బహుజన ప్రజలలో రక్తం పోటెత్తుతుంది, రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంబేద్కరిజాన్ని, పూలేఇజాన్ని అమలు చేయాలంటే సబ్బండ జాతి ఏకం కావల్సిందేనని, ప్రతి కులానికి ఒక సంఘం ఏర్పాటు చేసి వారి హక్కుల గురించి వారికి వివరించి, వారికి దక్కాల్సిన నిధులు, ఫలాలు ఎలా వృధా అయి ఇంకెవరికి ధక్కుతున్నాయో వివరించి వారిలో చైతన్యాన్ని నింపి, తుడుం దెబ్బ, నంగారా భేరి లాంటి కుల సంఘాల ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి వారిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఏకం చేసి వారికి అందాల్సిన ప్రభుత్వ ఫలాలను సక్రమంగా అందేల చూసి, దళిత, భహుజనులకు రాజ్యాధికారం అందించడమే తుది లక్ష్యంగా చేసుకొని ముందుకు నడిచిన ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, విప్లవ యోధుడు మారోజు వీరన్న. భౌతికంగా ఆయన ప్రజలకు దూరమై అమరుడైన రోజు ఈరోజు.. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మరోమారు తెలుసుకుందాం. బాల్యం నుండే తర్కం, హేతువాదాలతో విప్లవ రంగంలోకి అడుగు.. మారోజు వీరన్న గత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో కుల నిర్మూలనా చైతన్యానికి నిలువెత్తు రూపాలైన, ఆదర్శ దంపతులైన గుండగాని సూరమ్మ, మారోజు రామలింగం దంపతులకు 1962 జనవరి 1 న జన్మించారు. నిరుపేద విశ్వబ్రాహ్మణ సామాజికవర్గంలో, ఆదర్శ దంపతుకు జన్మించడంతో సహజంగానే కష్టాలు, కన్నీళ్లు, సుఖ దుక్కాల గురించిన అవగాహన, పురాణ ఇతిహాసాలపై, వాస్తవ సమాజ స్థితిగతులపై బాల్యం నుండే పట్టు ఏర్పడిందని అతన్ని బాల్యం నుండి గమనించినవారు చెబుతుంటారు. “వాలిని చెట్టు చాటునుంచి చంపినా రాముడు దేవుడు ఎలా అవుతాడని” తన తల్లిని అడిగినప్పుడు చిన్న పిల్లవాడులే అనుకున్నది కానీ తన కొడుకు తర్క ధోరణి విప్లవ బాట వైపుకు మల్లుతుందని గమనించలేదు ఆరోజు. ఉన్నత పాటశాలలో విద్యాభ్యాసం జరుతున్నప్పుడే “బండ రామారం” ఊర్లో భూస్వామి పై గ్రామస్తులు చేసిన పోరునే నాటికలుగా మలచి “అన్యాయం”, “ఊరు తిరగబడింది” వంటి నాటికలు పలు గ్రామాలలో ప్రదర్శించి, ప్రజలను చైతన్యపరిచారు. ఇంటర్ వరకూ ఎస్.ఎఫ్.ఐ.లో విద్యార్ధి నాయకునిగా పని చేసిన వీరన్న డిగ్రీ నుండి పిడిఎస్యు వైపు ఆకర్షితుడయ్యాడు. ఇందుకు కారణం అతని సోదరుడు ప్రగతిశీల కార్యకర్త అయిన సోమయ్య, ఇతని సాన్నిహిత్యం వీరన్నలో ప్రగతిశీల భావాలను పెంచింది. ఫలితంగా అనతికాలంలోనే పిడిఎస్యు అగ్ర నేత గా ఎదిగాడు. సైన్స్ చదువుతున్న తోటి విద్యార్థులకు సామాజిక స్పృహ మేల్కొలిపారు, విద్యార్థులు రాజకీయాల వైపు మొగ్గు చూపకపోతే సమాజానికి తీరని నష్టం చేసినవారవుతారని యువత రాజకీయాల వైపు ఆకర్షించేలా ప్రభావితం చేసాడు. 1982లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ భూ బౌతిక శాస్త్రం అధ్యయనంలోకి ప్రవేశించినప్పుడే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పిడిఎస్యు) రాష్ట్ర అధ్యక్షునిగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉద్యమాలను నడిపించి యువతలో పోరాట పటిమను రగిలించి అనేక విద్యార్ధి సమస్యలను రూపు మాపారు. సమాజంలో పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలకు కులమే కారణమని భావించిన వీరన్న, రిజర్వేషన్స్ ఎత్తివేయాలని ఎబివిపి లాంటి విద్యార్ధి సమాఖ్యలు చేస్తున్న ఉద్యమాలకు వ్యతిరేకంగా ఉద్యమించి అంబేద్కర్ రచనలను స్కూల్ సిలబస్ లో చేర్చాలని డిమాండ్ చేసాడు. 1990లో అరుణోదయ కళాకారిణి అయిన చైతన్య ను వీరన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి తరువాత ఇద్దరూ ఉద్యమంలో మమేకమయ్యారు. “క్యాప్టేషన్ ఫీజుల” పోరాటంలో ప్రభుత్వం పై విజయం.. క్యాప్టేషన్ ఫీజుల పోరాటంలో వీరన్నది చారిత్రాత్మక పాత్ర, 12 డెంటల్, 8 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సీటుకు 5 లక్షల రూపాయలు క్యాప్టేషన్ ఫీజుగా వసూలు చేసేందుకు మేనేజ్మెంట్ కు అనుమతులు ఇచ్చాడు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి. ఈ అక్రమం పై పిడిఎస్యు తరుపున మారోజు వీరన్న విద్యార్థుల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసాడు. వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడించాడు. ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్ లో కేసు వేసాడు. కోర్ట్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తపుబట్టడంతో నేదురుమల్లి రాజీనామా చేయాల్సి వచ్చింది. మారోజు వీరన్న చేసిన ఈ పోరాటం విద్యార్ధి ఉద్యమాల్లో మయిలు రాయిగా నిలిచింది. అంబేద్కర్, పూలే ఆశయాల సాధనలో.. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత మారోజు వీరన్న ఆలోచనలో స్పష్టత వచ్చింది. దేశంలోని కుల సమస్య, దళితులు, మైనారిటీలపై దాడులకు అగ్రకుల ఆధిపత్య ధోరణే కారణమని భావించాడు. పీడిత ప్రజలను ఐక్యం కాకుండా కుల వ్యవస్థే అడ్డుకుంటుందని వీరన్న నమ్మాడు. ఇండియాలో విప్లవం విజయం సాధించాకపోవడానికి కారణం ఈ కుల వ్యవస్థే కారణమని నమ్మాడు. విప్లవ నిరోధకశక్తిగా ఉన్న కుల వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే కుల, వర్గ విప్లవ సిద్ధాంతాలను స్వీకరిచాలని తలచి 1993లో జనశక్తిలో చేరి వర్గ పోరాటం తో పాటు, కుల నిర్మూలన పోరాటం సైతం చేయాలని విప్లవ పార్టీలను కోరాడు. కానీ ఆయన ప్రతిపాదనలపై దళిత వర్గాలలో జరిగినంత చర్చ విప్లవ పార్టీలలో జరగలేదు. ఇందుకు ఆ పార్టీలలోని అగ్రకుల నాయకత్వమే కారణమని విశ్వసించాడు. అంతే కాదు అంబేద్కర్, పూలే సిద్ధాంతాలను చర్చకు కూడా రానీయకుండా విప్లవ పార్టీల అగ్ర కుల నాయకులు కుట్ర చేసారని ధైర్యంగా బాహాటంగానే విమర్శించాడు. కారంచేడు, చుండూరు దళిత ఊచ కోతలు, రామ జన్మ భూమి పేరుతో పేద ముస్లింలపై దాడులను తీవ్రంగా నిరసించి, దళితుల హక్కుల సాధన కోసం, నిరుపేద ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వీరన్న పోరాడాలని నిర్ణయించుకొని 1994లో డఫోడం (దళిత ముస్లిముల ప్రజాస్వామ్య కార్యాచరణ వేదిక)ను ఏర్పాటు చేసాడు. వీరన్న వేసిన ఈ అడుగు జనశక్తి లో తీవ్ర వివాదం రేపింది. “డఫోడం”ను భారత విప్లవ సమైక్యతా కేంద్రం జనశక్తి నుండి విడిపోయింది. అయినా వీరన్న నిరుత్సాహపడకుండా దళిత, బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాటం చేయక తప్పదని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే కుల సంఘాలను ఏర్పాటు చేసాడు. “కుల ప్రాతిపదికన ఒక జాతిని కానీ, దేశాన్ని కానీ నిర్మించలేమని” అంబేద్కర్ చెప్పిన మాట వీరన్నను తీవ్రంగా ప్రభావితం చేసింది. కులాలను నిర్మూలించాలంటే ముందుగా ఆకులాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్గనైజ్డ్ గా ముందుకెల్లాలని, మిగతా కులాలతో మిత్ర వైరుధ్యాన్ని కలిగి ఉండాలని సూచించిన అంబేద్కర్ ఆలోచనలు అమలు చేయాలని అనుకున్నాడు. అందుకే వెనుకబడిన కులాలకు, దళిత, గిరిజన, ఆదివాసిలకు కుల సంఘాలను ఏర్పాటు చేసి అస్తిత్వ ఉద్యమాలకు ప్రాణం పోసాడు. ఈ క్రమంలో మాలలకు, మాదిగలకు ఉన్న వైరుధ్యాన్ని వీరన్న తొలగించాలని అనుకొని ఈక్రమంలోనే మంద కృష్ణ మాదిగ ఎం.ఆర్.పి.ఎస్.కు మద్దతునిచ్చి, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాదిగలు చేస్తున్న పోరాటానికి మాలలు కూడా మద్దతునివ్వాలని సూచించి ఇందుకోసం మాల “గుతుప దెబ్బ”ను ఏర్పాటు చేసాడు. మాదిగకు “మాదిగ దండోరా”, లంబాడిలకు “నగారా భేరి”, ఆదివాసిల కోసం “తుడుం దెబ్బ”, గొల్లల కోసం “గొల్ల కురుమ డోలు దెబ్బ”తో పాటు కమ్మరి, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగలి, మొదలగు వెనుకబడిన కులాలకు వారి వారి సంఘాలను ఏర్పాటు చేయించి ఒక ఆర్గనైజ్డ్ గా వారి వారి హక్కుల సాధనలో ముందుండి ఉద్యమాలు చేయించాడు. తద్వారా రాష్ట్రంలో 90శాతానికి పైగా ఉన్న దళిత, గిరిజనులు, బహుజనులతో ఐక్య పోరాటం చేయించాలని “దళిత బహుజన మహాసభను” ఏర్పాటు చేసి ఒకే వేదిక పైకి తీసుకొచ్చి రాజ్యాధికార పోరాటం చేయాలని యోచించాడు. దానితో ఆయన పార్టీ సిద్ధాంతాలను విబేధించి జనశక్తి పార్టీని దళిత బహుజన కమ్యూనిస్టు పార్టీగా పరివర్తన చెందించాలని ఆ పార్టీలో 1995 మే 17 నుంచి 1998 వరకు అంతర్గత పోరాటం చేశారు మారోజు వీరన్న. తద్వారా అణగారరిన కులాలు, జాతులు, తెగలను ఐక్యం చెయ్యడానికి దళిత బహుజన మహాసభ స్థాపించారు. ఐక్య రాజకీయ ఉద్యమాల నిర్వహణ కోసం మహాజన ఫ్రంట్ను రూపొందించారు. విద్యార్థులను బహుజన రాజ్య నిర్మాణానికి కార్యోన్ముఖులను గావించడానికి 1998 ఆగస్టు 18న బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎ్సఎఫ్) స్థాపించారు. చారిత్రక అస్తిత్వ ఉద్యమమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (మాదిగ హక్కు దండోరా) ఉద్యమ ప్రభావం వీరన్నపై ప్రగాఢంగా ఉంది. దీంతో అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలను విడి విడిగా సంఘటితం చేయడానికి మారోజు వీరన్న అనేక అణగారిన కులాలకు సంఘాలను వ్యవస్థాపించారు. “మేమెంత మందిమో మాకంత వాటా కావాలె” అని సామాజక, రాజకీయ పంపిణీ న్యాయ సూత్రంతో ముందుకురికారు.

మలి దశ తెలంగాణా ఉద్యమానికి మారోజు నాంది.. నిజాం రాజుల నియంతృత్వ పాలనలో అసువులు బాసి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో, అక్షరాస్యతలో వేల ఆమడ దూరంలో ఉండటంవలన అప్పటికే విద్యా, వ్యాపార, తదితర రంగాలలో ముందున్న ఆంద్ర పాలకుల మూలంగా తెలంగాణా అభివృద్ధి చెందే అవకాశం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా పౌరులకు రాజ్యాధికారం అందదని, విద్యా, ఉద్యోగ, నిధుల, నీళ్ళ కేటాయింపులలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాకు అన్యాయం జరుగుతోందని, తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడటమే దీనికి పరిష్కారమని నమ్మి తెలంగాణ సాధన ఉద్యమాలలో మమేకమైనారు మారోజు వీరన్న. భౌగోళిక తెలంగాణ రాష్ట్రంలో “బహుజనుల సామాజిక తెలంగాణ” ఏర్పడాలనే లక్ష్యం, నినాదంతో అయన తెలంగాణ మహాసభను స్థాపించారు. 1997 ఆగస్టు 11న సూర్యాపేట పట్టణంలో వేలాది మందితో తెలంగాణ రాష్ట్ర సదస్సు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమానికి ఆ రోజు మారోజు ఊపిరులూదారు. చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాటంలోనే.. అంబేద్కర్, పూలేల సిద్ధాంతాలను అమలు కోసం ఉద్యమించే క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు అయన పంధాను వ్యతిరేకించడంతో ఇండియా అంతర్రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీగా ఐక్య రాజకీయ ఉద్యమాల నిర్వహణ కోసం “మహాజన ఫ్రంట్”ను రూపొందించారు మారోజు వీరన్న. లక్షలాది దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలను తన ఉద్యమంలో బాగాస్తులను చేసి, ఉద్యమ తీవ్రతను పెంచి, అధికార ప్రభుత్వాలకు కంటి పై కునుకు లేకుండా చేయడమే మారోజు ప్రాణాలకు ముప్పుగా మారిందా? అంటే అవుననే సమాధానం లభిస్తోంది ప్రజలనుండి. మారోజు చేసే పోరాటాలను అడ్డుకోవాలంటే అది అనంత ప్రజావాహినిని అడ్డుకోవడమేనని, అది సాధ్యం కాదని భావించిన ప్రత్యర్థి రాజకీయ నాయకులు కుట్ర పన్ని బౌతికంగా మారోజు వీరన్నను 16 మే 1999 రోజున అంతమొందించారని ఆయన అభిమానులు, ప్రజలు నిర్ధ్వాంధ్వంగా అభిప్రాయపడుతుంటారు. మరోజునైతే మా నుండి దూరం చేశారు కానీ ఆయన నాటిన ఆశయాలను మానుండి వేరు చేయలేరని ఇప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం పలు కుల సంఘాలు, విప్లవ సంఘాల నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతుంటారు. అతివాద విప్లవంతో ప్రజా ఉద్యమాలు చేసి అధికార ప్రభుత్వాలకు మూడు చెరువుల నీళ్ళు తాగించేలా చేయడమే మారోజు వీరన్న అకాల మరణానికి కారణమని మేధావులు సెలవిస్తున్నారు. ఏది ఏమైనా భారత దేశం ఒక విప్లవ యోధున్ని, ప్రజా ఉద్యమ కెరటాన్ని కోల్పోయింది అనేది మాత్రం నిజం. భౌతికంగా మారోజునైతే అంతమొందించగలిగారు కానీ, దళిత, గిరిజన బహుజన పీడిత ప్రజల్లో ఆయన నింపిన స్ఫూర్తిని అంతమొందించలేక పోయారని, నేటికీ మారోజు వీరన్న విప్లవ భావాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాలు చేసే పలు సంఘాల నాయకులను చూస్తుంటే అర్థమవుతోంది. నిజానికి వీరులకు మరణం లేదని, వారి స్ఫూర్తితో వారు తరతరాలు ప్రజల్లో బ్రతికే ఉంటారని మారోజు వీరన్న జీవితాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఈ వ్యాసం మారోజు వీరన్న 24వ వర్ధన్తికి అంకితం.. ఆయనకు ఇదే ఘన నివాళి. - వ్యాసకర్త: శ్రీనివాస్ గుండోజు, పాత్రికేయులు, ఫోన్: 9985188429.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :