Monday, 26 February 2024 07:48:23 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

ఇంటి స్థలం కబ్జా.. మహిళపై దాడి.. రక్షించాలని మహిళ వేడుకోలు @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Garla, #LandGrabbing, #LocalNews, #Mahabubabad

Date : 27 June 2023 10:14 AM Views : 163

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంకు చెందిన బాడిస లక్ష్మి తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని తప్పుడు పత్రాలతో అజ్మీర మంగిలాల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడని.. అదేంటని నిలదీసిన తనపై మహిళ అని కూడా చూడకుండా మంగిలాల్ అతని భార్య రత్న కుమారితో కలిసి దాడి చేశాడని, అడ్డుకున్న తన భర్త వెంకటేశ్వర్లుపై సైతం దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ బాడిస లక్ష్మీ ఆమె భర్త వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా ముందు బోరున విలపిస్తు తెలిపారు.

Also Read : కోదాడపై జనసేన గురి..!! బరిలో మేకల సతీష్ రెడ్డి@DhivitiNews.com

సోమవారం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం కుమ్మర సంఘం జిల్లా కమిటీ నాయకులతో కలిసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాడిస లక్ష్మీ మాట్లాడుతూ.. గార్ల మండల కేంద్రంలో తాను కొనుగోలు చేసిన ఖాళీ స్థలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మంగీలాల్ దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగిందని, తప్పుడు పత్రాలు సృష్టించి దౌర్జన్యంగా కబ్జా చేసి ఇల్లు నిర్మణం చేపట్టడాని, దీనిపై మండల అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా తప్పుడు ఇంటి నెంబర్ తీసుకున్నాడని, తమ స్థలానికి సంబంధించి మంగీలాల్ తప్పుడు పత్రాలను పుట్టించి, తప్పుడు గ్రామపంచాయతీ అనుమతులు పుట్టించి ఇంటి స్థలం తనదే అని, పైగా తాము అప్పటికే నివాసం ఉంటున్న ఇంట్లోకి కూడా వచ్చి తన స్థలం మా ఇంట్లో ఉందని దౌర్జన్యం చేసి ఇంట్లోనే టైల్స్ ధ్వంసం చేశారని తెలిపారు. మంగిలాల్ పత్రాల ప్రతులను సేకరించి స్థానిక గ్రామపంచాయతీలో ఆర్టిఐ ద్వారా సమాచారం అడగగా గ్రామపంచాయతీ వారు మంగీలాల్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని నిర్ధారిస్తూ ధ్రువీకరించి పత్రాలు అందించడం జరిగిందని, ఆ పత్రాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. అలాగే అజ్మీరా మంగీలాల్ చూపిస్తున్న భూమి పత్రాలపై తప్పుడు తేదీలు ఉన్నాయని, తప్పుడు భూ పత్రాలు, తప్పుడు గ్రామపంచాయతీ అనుమతులతో అసలైన యజమానులమైన తమపై దాడులు చేస్తూ దౌర్జన్యంగా తమ భూమిని నివాస గృహాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ఎదురు తిరిగితే ఎస్టీ కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఆమె భర్త తెలిపారు. వెనుకబడిన తరగతులకు చెందిన కుమ్మరి కులస్తులమైన తమపై దౌర్జన్యాలకు అఘాయిత్యాలకు పాల్పడుతూ తమ భూమి తో పాటు సొంత ఇంటిని కూడా దౌర్జన్యంగా లాక్కోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మంగీలాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గార్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేయడం జరిగిందని తెలిపారు.

కుమ్మర సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిధానపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ బాధితులైన లక్ష్మి దంపతులకు రెవిన్యూ, గ్రామపంచాయితీ అధికారులు న్యాయం చేయాలని, కుమ్మర సామాజిక వర్గ ప్రజలపై దాడులు దౌర్జన్యానికి దిగితే సహించేది లేదని, ఈ విషయమై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు వారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలహీనవర్గాల ఇంటి స్థలాన్ని కబ్జా చేయడం దుర్మార్గమని, ఇక పిల్లలకు ఏం విద్యాబుద్ధులు నేర్పుతాడని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బాధితుల తరుపు బంధువులు, కుమ్మరి సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :