Thursday, 07 December 2023 09:36:38 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

నాయకుల స్థానాలకు.. నాయకురాళ్లు ఎసరు..!? @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #MalothKavitha, #ShankarNaik, #SatyavathiRathod, #BRS, #Assembly, #Mahabubabad, #SpecialStory, #LocalNews

Date : 27 June 2023 06:41 PM Views : 1248

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : త్వరలో జరగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలైన మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని సిట్టింగులు బానోత్ శంకర్ నాయక్ (మహబూబాబాద్), డిఎస్. రెడ్యా నాయక్ (డోర్నకల్)ల ఆశలపై అధిష్టానం నీళ్లు చాల్లే అవకాశాలే మెండుగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందుకు కారణంగా అధికార ప్రభుత్వం ఈ ఇద్దరు నేతలపై జరిపిన పలు సర్వేలు, నియోజకవర్గాలలో వీరి సభలకు ప్రజల హాజరు శాతం, తదితర వివాదాలను బేరీజు చేసుకొని అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అసలే కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంకు కలిగిన జిల్లా కావడం, ఈ రెండు నియోజకవర్గాల్లో గత రెండు దఫాలుగా ఈ ఇద్దరు అభ్యర్థులు నిలిచి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థులపై స్వల్ప ఆధిక్యతతో గెలిచిన చరిత్ర ఉండడం, ఈసారి సైతం వీరినే బరిలో దింపితే రెండు దఫాలు వీరిని గెలిపించాం, ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓ ఛాన్స్ ఇద్దామనే ధోరణిలో నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తే.. రెండు నియోజకవర్గాల్లో భారస అభ్యర్థులు ఓటమి చవిచూసే అవకాశాలను కొట్టిపారేయలేనిదిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండడంతో అధిష్టానం సైతం ఆ దిశలో ఆలోచించే అవకాసాహాలున్నాయని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుత ఎంపీ మాలోత్ కవిత ఆశించింది. చివరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కే అధిష్టానం టికెట్ కట్టబెట్టి, కవితకు ఎంపీ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తన కోరిక తీరుస్తూ మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఇస్తామని అధిష్టానం అప్పుడే కవితకు హామీ ఇచ్చినట్టు ఆమె తరుపు సన్నిహితులు తెలుపుతుంటారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం ఎంపీ కవిత అధిష్టానం వద్ద విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ఇక మంత్రి సత్యవతి రాథోడ్ విషయానికొస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె డోర్నకల్ నియోజకవర్గ టికెట్ ఆశించి సిట్టింగ్ రెడ్యాకే అధిష్టానం పచ్చజెండా ఊపడంతో, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీకి తనవంతు సహకారాన్ని అందించింది. దీనితో అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీ పదవితోపాటు మంత్రి పదవిని సైతం కట్టబెట్టి ప్రభుత్వంలో ఆమెకు తగు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అయినప్పటికీ, ఈ దఫా డోర్నకల్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నట్టు సత్యవతి తన మనసులో మాటను ఇటీవలే ఓ సభా వేదిక ద్వారా వెల్లడించడం విదితమే.. ఈ దిశగా మంత్రి అధిష్టానం వద్ద బలమైన లాబీలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేసుకొని, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని కాంక్షిస్తూ చెప్పులు లేకుండా గత కొంతకాలంగా పర్యటిస్తూ అధిష్టానం వద్ద తన విధేయతను చాటుతూ వస్తోందని రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

Also Read : తెలంగాణాలో ఆ పాట రివర్స్ అయింది..!! - మంత్రి సత్యవతి రాథోడ్ @DhivitiNews.com

అయితే, తామొకటి తలిస్తే.. దైవం మరోటి తలచినట్టు.. మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం కోసం ఎంపీ కవిత లాబీ చేస్తున్నప్పటికీ, ఆమె డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కూతురు కావడంతో ఒకే కుటుంబం నుండి జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలకు టికెట్ ఇవ్వలేని స్థితి అధిష్టానం వద్ద నెలకొని ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యాకు ఎదురుగాలులు వీస్తుండడంతో ఎంపీ కవితను డోర్నకల్ అసెంబ్లీ బరిలో నిలుపుతే సానుకూల ఫలితాలు వస్తాయనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సత్యవతి రాథోడ్ కోరినట్లు డోర్నకల్ టికెట్ ఆమెకు ఇస్తే రెడ్యా సహకరించలేని పరిస్థితుల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సునాయాసం కావచ్చు. కావున రెడ్యా ఫ్యామిలీలో సభ్యురాలైన కవితను డోర్నకల్ బరిలో నిలపడం ద్వారా రెడ్యా సైతం తన కూతురి గెలుపుకోసం సహకరించాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇక సత్యవతి రాథోడ్ విషయానికొస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె డోర్నకల్ నియోజకవర్గాన్ని ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. మంత్రి పదవి దక్కించుకున్నప్పటికీ ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని నియోజకవర్గంలో కొనసాగించాలనే ఆలోచనలో ఆమె బలంగా ఉన్నట్టు ఇటీవలే ఆమె మనసులో మాటలు విన్నవారికి అర్థమవుతుంది. కానీ ఆమె కోరినట్టు ఆమెకు డోర్నకల్ స్థానాన్ని ఇస్తే రెడ్యానాయక్ ఆమె గెలుపుకు సహకరించడం అసంభవం అనే విషయం తెలిసిందే. దీనితో ఆమెకు డోర్నకల్ టికెట్ ఇచ్చి ఓటమి చవిచూడడం సరికాదని అధిష్టానం భావిస్తోందట. మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విషయంలో చోటు చేసుకున్న పలు వివాదాలు, సర్వేల ఫలితాల మూలంగా ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని నిలిపి ప్రయోగాలు చేసేకంటే, మంత్రి సత్యవతికే ఆ టికెట్ ఇస్తే.. రెడ్యా నాయక్ నుండి వ్యతిరేకత మానుకోటలో పని చేయదని, దీనితో మానుకోటలో భారస గెలుపు సాధ్యమవుతుందని యోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇలా ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ లకు జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టే అవకాశాలున్నట్టు వినికిడి.

ప్రత్యామ్నాయ అవకాశాలతో సిట్టింగ్ లకు ఆశ చూపనున్న అధిష్టానం... విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు జిల్లాలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యే లకు టికెట్ ఇవ్వకుండా, వారు అసంతృప్తికి గురికాకుండా రెడ్యాకు ఆయన స్థానంలో ఆయన కూతురిని, శంకర్ నాయక్ స్థానంలో సత్యవతి రాథోడ్ ను నిలిపి పార్టీ నిర్ణయానికి వారిద్దరూ కట్టుబడి ఉండేలా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. రెడ్యా నాయక్ ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల రీత్యా ఈ ఒక్క దఫా మాత్రమే తాను రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటానని సంకేతాలు ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు రాబోయే తమ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్ పదవో, లేదా మరే గౌరవప్రదమైన పదవినో కట్టబెడతామని అధిష్టానం హామీ ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు తెలుపుతున్నాయి. అలాగే, శంకర్ నాయక్ కు ప్రభుత్వంలో తగు ప్రాధాన్యత కల్పించేలా ముఖ్యమైన పదవి ఇవ్వడమో.. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వడమో లేదా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనే వేరే నియోజకవర్గంలో ఆయనకు టికెట్ ఇవ్వడమో జరుగుతుందని సమాచారం వెలువడుతోంది. ఏది ఏమైనప్పటికీ.. అధిష్టానం మదిలో ఏముందో ఖచ్చితంగా తెలియాలంటే.. మరికొద్దిరోజులు వేచిచూడక తప్పదు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :