Monday, 26 February 2024 08:25:34 PM
# సాలార్ (Salaar) రిలీస్ ట్రైలర్.. అలా ఉంటే సినిమాపై అనుమానాలే @DhivitiNews.com # ప్రో. కోదండరామ్‌ కు ప్రభుత్వంలో చోటు..?!@DhivitiNews.com # సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు

ఆత్మహత్యలు అప్పుడే నివారించగలం.. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #MLC, #TakkellapalliRavindarRao, #Mahabubabad, #LocalNews

Date : 02 July 2023 06:46 PM Views : 103

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం ఆవిష్కరణ... మనుషుల మధ్య సంబంధాలు క్షీణించి పోవడం సమాజానికి మంచి పరిణామం కాదని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మనుషుల మధ్య ప్రేమ, అభిమానం, సత్సంబంధాలు ఉన్నప్పుడే ఆత్మహత్యలు, పరస్పర కలహాలు నివారించడం సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, భాషా సాహిత్యాలు, పురావస్తు కట్టడాలు, జిల్లా ప్రముఖులు మొదలైన వివిధ రంగాల గురించి తెలంగాణ సారస్వత పరిషత్తు వెలువరిస్తున్న గ్రంథాల పరంపరలో రూపొందించిన మహబూబాబాద్ జిల్లా సమగ్ర స్వరూప గ్రంథావిష్కరణ ఆదివారం నూతన కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె.శశాంక, శాసనమండలి సభ్యులు టి.రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు.

Also Read : నాయకుల స్థానాలకు.. నాయకురాళ్లు ఎసరు..!? @DhivitiNews.com

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రవీందర్ రావు మాట్లాడుతూ మహబూబాబాద్ కు తెలంగాణలో విశిష్టమైన స్థానం ఉందని, ప్రాంత ప్రత్యేకతను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రయత్నించి జిల్లాను సాధించుకున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లా అస్తిత్వం, చరిత్ర, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా ఈ తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వివిధ అంశాల పైన పుస్తక పఠనం అలవాటు చేయాలని, మనదైన సాహిత్యం, సమాజం, నైతిక విలువలు, మానవ సంబంధాల గురించి బాల్యంలోనే అవగాహన కలిగించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రాచీన, ఆధునిక సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంపదను 56 వ్యాసాల రూపంలో నిక్షిప్తం చేసిన తెలంగాణ సారస్వత పరిషత్తు వారి కృషి అభినందనీయమని తెలిపారు. ప్రతి పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు ఈ గ్రంథాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసి అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య అధ్యక్షోపన్యాసం చేస్తూ పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు స్ఫూర్తితో, సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రేరణతో తాము జిల్లా సమగ్ర స్వరూప గ్రంథాలను తీసుకొస్తున్నామని, ఇప్పటివరకు 12 జిల్లాల గ్రంథాలు పూర్తయ్యాయని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వ్యాస రచయితలను మెమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావు, సహకార శాఖ అధికారి సయ్యద్ ఖుర్షీద్, మద్దెర్ల రమేష్, గుండెల రాజు, పాత్రికేయులు గుట్టయ్య, చీకటి శ్రీనివాస్, వేముల అయోధ్యరామయ్య, గుండోజు శ్రీనివాస్, వ్యాస రచయితలు తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2024. All right Reserved.

Developed By :