Thursday, 07 December 2023 10:11:57 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

ఎన్నికల సీజన్ వ్యాపారులతో కాంగ్రెస్ కు నష్టం - వ్యాసం @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Congress, #Mahabubabad, #LocalNews

Date : 02 July 2023 07:48 PM Views : 533

దివిటీ న్యూస్ - ఎడిటోరియల్ / : పార్లమెంట్ లో తెలంగాణా బిల్ పాస్ అవుతున్న క్రమంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. స్వరాష్ట్ర సాధన కోసం అనన్యత్యాగాలు, భలిధానాల పరంపరతో చలించిన కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తన అధికారాన్ని తృణప్రాయంగా భావించింది పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్ పాస్ చేసింది. ఆ తెగింపు భారతదేశ చరిత్రలో ఆమె నిర్ణయం సువర్ణ అక్షరాలతో లికించుకుంది. ఈ ఘటన ఒక చారిత్రక సత్యంగా నిలిచింది అనేది ఎవ్వరు తీసిపోలేని నిజం. అధికారాన్ని పరిత్యజించిన ఆమెకు సోనియా ఇచ్చిన తెలంగాణాలో రిటర్న్ గిఫ్ట్ గా కాంగ్రెస్ ను ఓడించి, ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నాడు కెసిఆర్. కాంగ్రెస్ లో రాష్ట్రం ఏర్పాటుకు ముందు సోనియా వెంట నడిచి, సమైక్య ఆంధ్రను సమర్ధించి, తెలంగాణకు అడ్డుగా నిలిచి, మానుకోట రాళ్ళతో ప్రాయశ్చిత్తం జరుపుకొని, రాష్ట్రం వచ్చాక కెసిఆర్ తో అక్రమ పద్దతిలో జోడి గట్టిన ఫిరాయింపు శాసనసభ్యులు, ఎంపీలు, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి ఒచ్చిన జంపింగ్ జపాంగ్ లు తెలంగాణ ఇచ్చిన సోనియా ఋణం ఏమాత్రం తీర్చుకున్నారో తెలుసుకోవాలి.

Also Read : నాయకుల స్థానాలకు.. నాయకురాళ్లు ఎసరు..!? @DhivitiNews.com

9 సంవత్సరాల పరిపాలన దషాబ్ది ఉత్సవాల పేరిట బిఆర్ఎస్ ప్రచార కార్యక్రమంగా కొనసాగింది. విద్యా, వైద్యం కార్పొరేట్ పరం అయి, సంక్షేమపధకాల వెనుక వ్యూహత్మక దోపిడీగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్ట్ లు వెలిశాయి. ఈ దోపిడీ పై సరైన రీతిలో బీజేపీ నోరు తెరువకపోవడంలో ఉన్న మతలబును కాంగ్రెస్ నాయకులు సరైన రీతిలో ఎండగడుతున్నారా? పోడు భూముల పట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాధననే విషయం కాంగ్రెస్ నాయకులూ ప్రజలకు సరైన రీతిలో వివరిస్తున్నారా? ధరణి తెలంగాణా భూముల పాలిట చరమగీతంగా కొనసాగుతుంటే ప్రజల తరుపున పోరాటం ఎంతమాత్రం చేస్తున్నట్టు?, కాంగ్రెస్ పార్టీ గతంలో సీలింగ్ పేరుతో పేదలకు పంచిన భూములు, భూములు వదులుకొని పట్టణాల్లో తల దాచుకున్న దొరల భూములు, భూదాన్ భూములు, దేవాదాయ, వాక్ఫు భూములు, గ్రామకంఠ భూములు, ప్రభుత్వ భూముల లెక్కలు ప్రభుత్వ ఎమ్మెల్యేలు మొత్తం రికార్డులో తారుమారు చేసి అందినకాడికి దండుకోవడం, లేదా ప్రభుత్వమే ప్రభుత్వ కార్యాలయాల పేరిట వెనక్కి తీసుకోవడం జరుగుతోంది. మొత్తంగా 6 లక్షల కోట్లుగా రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యిందని సమాచారం. ఇవ్వన్నీ ప్రజల ముందు ఉంచకుండా ధర్నా చౌక్ ఎత్తి వేయడం, ప్రతిపక్షం అనే పదం ఉండకుండా తెలంగాణా నిఘంటువు నుండి తీసివేయజూసిన నియంత పాలన, మొత్తంగా కుటుంబం పాలనతో అధికారం, ఓటు బ్యాంక్ ముసుగులో ప్రజాధనంను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకొని, భారత రాష్ట్ర సమితి పేరున టక్కరి మాటలతో జాతీయ పార్టీ పెట్టడం, అభూత మిద్యాఅభివృద్ధి ముసుగును ప్రజలకు తెలియకుండా చేస్తున్న అధికార భారాస ను గద్దెదింపడానికి జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధి ఎంతవరకు నమ్మేలా ఉంది? కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తానని ముందుకు వచ్చే నాయకులు గతంలో కాకుండా ఒక ఉద్యమ స్వభావంతో ముందుకు రావాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 9 సంవత్సరాల నుండి ప్రజలతో నిరంతరం టచ్ లో లేకుండా వారి వారి వ్యాపారం, సంపాదనకు పరిమితమయి మళ్ళీ నోట్ల కట్టలతో ముందుకు వస్తాం అంటే నియోజకవర్గాలలోని ప్రజలు విశ్వసిస్తారా? ప్రతి పక్షంగా కాంగ్రెస్ నాయకుల పాత్ర ఏంటో.. వారు నియోజకవర్గ ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష నాయకులుగా ఏంచేశారో నెమరు వేసుకోవాలి. రైతు ఆత్మహత్యలు, పంటనష్టం, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఉద్యోగుల బదిలీల సమస్యలు, నకిలీ విత్తనాలు, రైతు చట్టాలు, టీఎస్పిఎస్సి కుంభకోణం, అధికార నేతల భూకబ్జాలు ఇలాంటి సమస్యలు నిరంతరంగా కొనసాగుతున్న సమయంలో మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతు ఎత్తిన సంస్క్రతికి శ్రీకారం చుట్టారా? మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండాను ప్రతిపక్షం గొంతుగా మలిచిన నాయకులు ఎవరు? అంకితంభావం లేకుండా, రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల ఆలోచన విధానం, ప్రత్యర్థిపై వాళ్ళు తీసుకున్న స్టాండ్ గురించి ఏమి చెబుతారు? ఎలక్షన్స్ రాగానే ఎప్పటి లాగానే సీజన్ రాజకీయ వ్యాపారగాళ్ళు ఒచ్చినట్లు కొందరు కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలో ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని కనపడ్డ ప్రతివాడితో ఆప్యాయంగా మాట్లాడుతూ, కాఫీలు, టిఫినీలు చేసి, వాకింగ్ చేస్తూ పలకరించేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విపణి వీధిలో చౌకబారు రాజకీయాలు చేస్తానంటే జిల్లా ప్రజలు ఒప్పుకుంటారా? ఇక్కడి స్థానంలో ఎమ్మెల్యే కావాలంటే కేవలం ఎన్నికల వేళ మాత్రమే ఇక్కడ ప్రత్యక్షమయితే సరిపోదు. ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న ఆశలు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు తీర్చగలిగినప్పుడే వారికి ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. గెలిచాక ఆస్తులు పోగు వేసుకోవడం కోసం రాజకీయాలు చేస్తామనే లోలోపలి వ్యూహం, స్వార్థంతో కాంగ్రెస్ పార్టీని మరింత బ్రష్టు పట్టించే కొందరు నాయకులు, వారికి వత్తాసుపలికే కేడర్ కాస్త ఆలోచించాలి. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేంత ఓటు బ్యాంకు ఉన్న మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవలేకపోతున్నారో కాస్త ఆలోచించాలి. ప్రజా చైతన్యాన్ని తక్కువగా అంచనా వేసి వ్యాపారాత్మక ధోరణితో రాజకీయాలు చేస్తే మళ్ళీ గెలవాల్సిన సీట్లు కాస్తా ఓడిపోక తప్పదని కాంగ్రెస్ జిల్లా ఇంచార్జులు, టిపిసిసి నాయకులు గమనించాలి. టికెట్ తెచ్చుకున్నంత మాత్రాన గెలుపు కాయం అనుకుంటే పొరపాటే.. గెలిచినా, ఓడినా లాభంగానే భావిస్తూ... టికెట్ ప్రయత్నంలో ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకుల్లారా, తెలంగాణ ఇచ్చిన సోనియా త్యాగాన్ని, రాహుల్ నాయకత్వాన్ని, రేవంత్ కష్టాన్ని కాస్త గౌరవించి జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ నాయకుల నుండి ఏమి కోరుకుంటున్నారో ఆలకించి ముందడుగు వేయాలి.

వ్యాసకర్త: పాత్రికేయులు, కవి, గాయకులు, విశ్లేషకులు వేముల అయోధ్య రామయ్య

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :