Thursday, 07 December 2023 10:30:57 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం ఆరా..!? ఉద్యమ నేతకు అవకాశం దక్కేనా?? @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #RavikumarNaik, #KCR, #BRS, #Mahabubabad, #LocalNews

Date : 06 July 2023 09:41 AM Views : 892

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) సమీపిస్తున్న వేళ, మహబూబాబాద్ నియోజకవర్గ (Mahabubabad Constituency) సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Shankar Naik) స్థానం పై చర్చలు జరుగుతున్నాయి. మొదట శంకర్ నాయక్ స్థానంలో మంత్రి సత్యవతిని (Satyavathi Rathod) నిలుపుతారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. కాగా ప్రస్తుతం అదేమీ కాదని శంకర్ నాయక్ స్థానంలో కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం ఆరాతీస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే లీకులు ఇస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ స్థానికుడు, విద్యావంతుడు, తెలంగాణ ఉద్యమకారుడు అయిన బానోతు రవికుమార్ నాయక్ (Banoth Ravikumar Naik) అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పరిశీలిస్తుందా? అనే సందేహాలు ప్రస్తుతం మానుకోట (Manukota) నియోజకవర్గంలో చర్చకు దారితీస్తోంది.

Also Read : నాయకుల స్థానాలకు.. నాయకురాళ్లు ఎసరు..!? @DhivitiNews.com

రవికుమార్ నాయక్ విషయానికొస్తే ఆయన మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలం, మచ్చర్ల గ్రామ పరిధిలోని రేగడి తండాకు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ (TRS) అవతరించినప్పటి నుండి రవికుమార్ వివిధ దశల్లో వివిధ విభాగాల్లో పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. 2008 నుండి 2014 వరకు టిఆర్ఎస్ విద్యార్థి విభాగం (TRSV) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ గా, 2014 నుంచి 2019 వరకు విద్యార్థి విభాగం స్టేట్ జనరల్ సెక్రెటరీగా, 2019 నుంచి నేటి వరకు బారాస రాష్ట్ర నాయకుడిగా, వన్యప్రాణి సంరక్షణ కమిటీ రాష్ట్ర సభ్యునిగా, కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) లకు విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. ఇక తెలంగాణ ఉద్యమంలో (Telangana agitation) రవికుమార్ నాయక్ పాత్ర గురించి తెలపాల్సి వస్తే 2008 అక్టోబర్ 4న సమైక్య రాష్ట్రంలో పిఆర్పి నేత, సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) పర్యటనను అడ్డుకుంటూ చిరంజీవిపై కోడుగుడ్డు ఎసిరి తెలంగాణ ఉద్యమ వేడిని రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా చేశారు. అలాగే సమైక్య రాష్ట్రంలో పచ్చి సమైక్యవాది అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మానుకోట పర్యటనను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమంలో రవికుమార్ పాత్ర కీలకమైనది.. రైళ్ల దగ్ధం, రైల్ రోకో వంటి కార్యక్రమాలలో పాల్గొని, నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమ తీవ్రతను చాటి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తెలంగాణ ఉద్యమంలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికీ వందల కేసులకు ఉండగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న చరిత్ర రవికుమార్ నాయక్ ది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమంలో పోరాడినవాళ్ళకు పదవులు దక్కక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండగా ఉద్యమ కాలంలో పిఆర్పి (PRP), కాంగ్రెస్ (Congress), టిడిపి (TDP) లాంటి సమైక్య భావన కలిగిన పార్టీలలో ఉన్న వారికి మహబూబాబాద్ లో ఉన్నత పదవులు దక్కడంతో తెలంగాణ ఉద్యమకారులు భారాస ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతతో ఉండటం విదితమే.

రవికుమార్ నాయక్ కు మానుకోట ఎమ్మెల్యే టికెట్ అందిస్తే అధిష్టానంకు కలిసి వచ్చే సానుకూల అంశాలను ఓసారి పరిశీలించినట్లయితే రవికుమార్ నాయక్ నియోజకవర్గ స్థానికుడిగా, ఉద్యమకారుడిగా, విద్యావంతునిగా, వివాదాలకు తావు లేని వ్యక్తిగా, పార్టీలో నాయకులందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా అతని అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే.. నియోజకవర్గంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, యువత, ప్రజా సంఘాలతో తెలంగాణ ఉద్యమ కాలం నాటి సత్సంబంధాలు నేటికీ ఉండడంతో రవి కుమార్ నాయక్ అభ్యర్థిత్వానికి ఆయ విభాగాలు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా మానుకోట అసెంబ్లీ స్థానంలో మార్పు తప్పనిసరి అయితే ఈ నియోజకవర్గ స్థానికుడు, తెలంగాణ ఉద్యమకారుడైన బానోత్ రవికుమార్ నాయక్ కు పార్టీ టికెట్ ఇస్తే.. తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం పై ఉన్న అపవాదులను కొంతలో కొంతైనా తొలగించుకోవచ్చునని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలుగా వెల్లువెత్తుతున్నాయి. మరి అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుందా..? లేదా..? అనేది మరికొద్ధి రోజుల్లో తేలనుంది.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :